'' ప్రజలెవరూ ఇంట్లోంచి బయటకు రావొద్దని...'' జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ కోరారు.

 '' అంతేకాని మీరు మాత్రం ఎప్పటికీ రోడ్లు బాగుచేయరన్న మాట..''    social media

'' ఇదీ మన ఘనమైన జీహెచ్‌ఎంసీ గారి బహు గణ్యమైన సూచన...ప్రజల నుండి పిక్కుపిండీ పన్నులు వసూలు చేస్తారు...కానీ రోడ్లు వేయడం చేతకాదు...మురికికాలువల్ని సరిచేయడం చేతకాదు...నాలాల ఆక్రమణల్ని అడ్డుకోవడం చేతకాదు...కానీ ఇలా ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వడానికేం తక్కువలేదు...ప్రతీ వర్షాకాలంలో రోడ్లు వరదలతో మునిగిపోగానే, వచ్చే వర్షాకాలం నాటికి అన్నీ సరిచేస్తాం అనే నీటిమీది రాతలు. షరా మామూలే... కానీ మళ్ళీ వచ్చే వర్షాకాలంలో కూడా ఇదే అరిగిపోయిన రికార్డ్. "రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం..."లా...GHMC కమిషనర్లు ఎందరో మారుతున్నారు, కానీ రోడ్ల పరిస్థితి, మురికినీటి పరిస్థితి మాత్రం మారట్లేదు. ప్రజల కష్టాలు తీరట్లేదు... పన్నులూ కట్టక తప్పట్లేదు...'' అని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దానకిషోర్‌ ఏమంటారంటే ...

హైదరాబాద్‌ నగరంలో వర్షాలు కురిసేటప్పుడు ప్రజలెవరూ ఇంట్లోంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ కోరారు. అప్పటికే రోడ్లపై ఉన్నవారు సాఫీగా వెళ్లేందుకు అవకాశమివ్వాలన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రతి చోటా రెండు మోటార్లు ఏర్పాటు చేసి నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తోడేసి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. విపత్తులను ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీలో 8 బృందాలు ఉన్నాయని.. మరో 8 ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.హైదరాబాద్‌ నగరంలో గంటకు 2 సెంటీమీటర్ల వర్షపాతం తట్టుకునే డ్రైనేజీ వ్యవస్థ మాత్రమే ఉందని..

అంతకంటే ఎక్కువ వర్షం పడితే ఇబ్బంది అవుతుందని దానకిషోర్‌ అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 160 వరద ముంపు ప్రాంతాలున్నాయని చెప్పారు. మాదాపూర్‌ ప్రాంతంలో నిర్మాణాల వ్యర్థాలతో డ్రైనేజీ నిలిచిపోయి రోడ్లపైకి నీరు వచ్చిందన్నారు. ఐటీ కారిడార్‌ కొండపూర్‌, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ పరిదిలో పనిచేస్తున్న సుమారు 5లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఒకేసారి బయటకు రావొద్దని.. విడతల వారీగా వస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవని ఆయన సూచించారు


మరింత సమాచారం తెలుసుకోండి: