అవును మీరు చదివింది నిజమే. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి పవన్ మద్దతు ఇస్తున్నది ప్రజావేదికను కూల్చివేయటంలోనే. అక్రమ కట్టడమని తేలితే ప్రజావేదికతో పాటు అన్నీ నిర్మాణాలను కూల్చి వేయాల్సిందే అంటూ స్పష్టంగా చెప్పారు.

 

ఒకవైపు అక్రమ నిర్మాణమైన ప్రజావేదికను కూల్చేయాలని జగన్ ఆదేశించారో లేదో వెంటనే టిడిపి నేతలు అంతెత్తున ఎగిరెగిరి పడుతున్నారు. టిడిపి నేతలకు కూడా తెలుసు ప్రజావేదిక అక్రమ  కట్టడమేనని. అయినా కానీ ప్రతిపక్షం కదా అందుకనే ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని అనుకున్నట్లుంది.

 

అందుకనే జగన్ తాజా నిర్ణయాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే జగన్ తీసుకున్న నిర్ణయానికి  జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు పలకటం మాత్రం టిడిపి నేతలు ఊహించలేదు. దాంతో వాళ్ళు జగన్ తో పాటు పవన్ పైన కూడా మండిపోతున్నారు. కాకపోతే చంద్రబాబు ఆదేశాలు లేకపోవటంతో పవన్ పై ప్రస్తుతం ఏం మాట్లాడలేకపోతున్నారు. ఇంతకీ అక్రమ కట్టడమని తేలితె అన్నీ నిర్మాణాలను కూల్చేయాలని పవన్ అన్నది చంద్రబాబుంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను కూడా దృష్టిలో పెట్టుకునేనా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: