కొంద‌రికి గొప్ప మ‌న‌సు ఉంటుంది. ఆ మ‌న‌సు ఉన్న వారు స‌మ‌యం, సంద‌ర్బం, హోదా కంటే కూడా...త‌క్ష‌ణం స‌హాయం చేయాల‌నే ఆలోచ‌న ఉంటుంది. ఇత‌రుల‌ను ఆదుకోవాల‌నే త‌పన ఉంటుంది. అలాంటి త‌ప‌న‌తో స‌హాయం చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు వైసీపీ నేత‌, ఏపీ యువ‌మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌. అమరావతిలో జరిగే సీఎం సమీక్ష సమావేశానికి ఉదయం నెల్లూరు నుంచి బయలుదేరి వెళ్లిన అనిల్ మార్గ‌మ‌ధ్యంలో...ప్రమాదంలో గాయపడినవారిని చూసి చలించిపోయి తన కారులో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అంతలోనే 108రావడంతో మంత్రి అనుచరులు క్షతగాత్రులను ఆ వాహనంలో ఎక్కించారు. అనంత‌రం వారి ఆరోగ్యం గురించి వాక‌బు చేశారు.  


ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద ఓ రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ స‌మ‌యంలో అమ‌రావ‌తికి వెళుతున్న మంత్రి అనిల్ ఆ యాక్సిడెంట్‌ను చూసి త‌న వాహనం అక్క‌డే నిలిపారు. క్షతగాత్రులను ఎలాగైనా బతికించాలనే తాపత్రయంతో ``'108 ఆలస్యమైతే నా కారులో తీసుకెళ్లండి..``అని తన సిబ్బందిని మంత్రి ఆదేశించారు. అయితే,  అంతకుమందే అక్కడి వారు108కు సమాచారం ఇవ్వడంతో.. ఆ వాహనంలో వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించాలని వారిని ఆదేశించారు. మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మానవతా హృదయం ప‌ట్ల అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. 


మంత్రులంటే..త‌మ ప‌నేదే తాము చూసుకోవ‌డం, ప‌క్క‌న సాధార‌ణ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నా ప‌ట్టించుకోని వారిని చూశామ‌ని....అలాంటిది ఓ మంత్రి కాన్వాయ్ ఆపి ప‌రిస్థితి గురించి తెలుసుకోవ‌డ‌మే కాకుండా క్ష‌త‌గాత్రుడికి న్యాయం చేసేందుకు త‌న వాహ‌నాన్ని సైతం అందించడం గొప్ప విష‌య‌మ‌ని ప‌లువురు కొనియాడుతున్నారు. గొప్ప మ‌న‌సు ఉన్న నాయ‌కుడిగా అనిల్ కుమార్ నిలుస్తార‌ని పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: