హీరో రామ్‌కి చుక్కలు చూపించిన పోలీసులు..?

హైదరాబాద్‌ నగరంలో ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు రామ్‌ కి పోలీసులు ఫైన్‌ విధించారు.బహిరంగ ప్రదేశంలో పొగ తాగడం నేరం అని రామ్‌కి వివరస్తూ, ఫైన్‌ విధించారు.

ఛార్మినార్‌ సబ్‌ఇన్సిపెక్టర్‌ పండరి రూ.200లు ఫైన్‌ కట్టాల్సిందిగా నటుడు రామ్‌కి నోటీసులు జారీ చేశారు.

బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడం నేరమా?

అవును, చట్టరిత్యా నేరమని ప్రముఖ దంత వైద్యులు ఓ. నాగేశ్వరరావు అంటున్నారు.

'' దేశంలో ప్రతి రోజు 2200 మంది పొగాకు సేవించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పొగాకు మహమ్మారి నుంచి ప్రజలు తనకు తానుగా కాపాడుకోవాలి. వ్యాపారులు 15 సంవత్సరాలలోపు వయస్సు వారికి ఎట్టి పరిస్థితులలోనూ సిగరెట్లు అమ్మవద్దని, అమ్మినట్లయితే షాపు యజమానికి పొగాకు చట్టం 2003 సెక్షన్‌ 6 ప్రకారం రూ.1000 జరిమాన, 5 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. బహిరంగ ప్రదేశంలో పొగతాగితే ఆ వ్యక్తికి, అమ్మిన షాపు యజమానికి సెక్షన్‌ 4 ప్రకారం రూ.200 జరిమాన విధించడం జరుగుతుందన్నారు. సెక్షన్‌ 5 ప్రకారం పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేయకూడదని అలా ప్రచారం చేసినట్లయితే నేరం . వైద్యులు, సెలబ్రెటీలు, సినీ హీరోలకు పొగాకు వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన సామాజిక బాధ్యత ఉందని'' డాక్టర్‌ నాగేశ్వరరావు అన్నారు.

Actor Ram who was shooting for a film was imposed a fine by the police for smoking at a public place. Charminar SubInspector Pandari noticed fined him Rs 200.


మరింత సమాచారం తెలుసుకోండి: