సీఎంగా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ  ప్రతి విషయంలో పక్కా  క్లారిటీతో ముందుకి వెళ్తున్నాడు జగన్.  అయితే ఒక “అమ్మ ఒడి” పధకంలో మాత్రం జగన్ కి  క్లారిటీ మిస్ అయింది.  మొదట ప్రభుత్వ పాఠశాలలు తమ పిల్లలను  పంపే ప్రతి తల్లికి ఒక్కో ఏడాదికి 15 వేలు చొప్పున ఇస్తానని జగన్ హామీ ఇచ్చాడు.  ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమలుపు సురేష్ కూడా అధికారికంగా ప్రకటించాడు. కానీ ఇప్పుడు చేసేంది ఏమిటి ?  రాష్ట్రంలో తమ పిల్లలని స్కూల్ కి పంపే ప్రతి తల్లికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకున్నారు. దీని వల్ల ప్రభుత్వ పాఠశాలలు ఇంకా దారుణంగా తయారువుతాయని  జగన్ ఎందుకు ఆలోచించలేకపోయాడు.  


ఇప్పటివరకూ ప్రవేశపెడుతున్న పధకాల అన్నిటికీ మంచి పేరు తెచ్చుకున్న జగన్... ఈ అమ్మబడి పధకంలో మాత్రం విమర్శలు ఎదురొకోవాల్సి వస్తోంది. చూస్తుంటే ఈ పధకంలో లొసుగులు కూడా జరుగుతున్నాయని లకలుకలు వినిపిస్తున్నాయి.  ప్రవేట్ పాఠశాలల యాజమాన్యం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోనిరావడం వల్లే..  ప్రవైట్ స్కూల్ కి పంపే తల్లికి కూడా 15 వేలు వచ్చేలా  జగన్ పధకంలో మార్పులు చేసారని అంటున్నారు. ఈ విషయంలో జగన్ స్పష్టంగా  ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం తీసుకున్నాడని అర్ధమవుతుంది.


ఏమైనా   ప్రభుత్వ పాఠశాలకు పంపే తల్లులకు మాత్రమే ఈ పథకం పెట్టి ఉంటే..   ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలకు మంచి డిమాండ్ వచ్చేది. జగన్ కి మంచి పేరు వచ్చేది. కానీ ఇప్పుడు  ఉన్న మంచి పేరు కాస్త.. చెడిపోయేలా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: