తెలుగు దేశం పార్టీ నాయకులు మాటల తీరు గురివింద చందంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. తప్పులెంచువారు తమ తప్పులెరుగరన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆకాశం మీదిగా ఉమ్మినట్టుగా తిరిగి వారికే ఆ విమర్శలు ఎదురవుతుండటంతో తెలుగు నేతలు కిమ్మనడంలేదు. 
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా టిడిపి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నామన రాంబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కాగా మాజీ హోమ్‌ మంత్రి , ప్రస్తుత పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప , మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు తదితర యమాహెమీలు హాజరయ్యారు. 


ఈ సంధర్భంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య  చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌పై పలు ఆరోపణలు సంధించారు. అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కుంటోన్న జగన్ అవినీతి వ్యతిరేకమని ప్రకటనలు చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. జగన్ 12 కేసుల్లో నిందితుడు 40 వేల కోట్లు ఈడి సీజ్ చేసిందని గుర్తు చేశారు. ఆయన మంత్రివర్గంలో బొత్స అవంతిలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అవినీతిపై మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదన్నారు. 


కాంట్రాక్టుల పేరుతో లెక్కలేని కుంభకోణాలకు పాల్పడ్డ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని విమర్శించే హక్కలు కనీసపాటి కూడా లేదని సామాన్యులు చెప్పటం విశేషం.  మేమేసిన రోడ్లు, వీధిలైట్లు, పించన్లు అంటూ వేటు వేయకపోతే వాటిని నిలిపివేస్తామని బెదిరించిన చంద్రబాబుకి ఆయన అనుచరగణానికి ఇప్పటికీ బుద్ధిరాలేదని దుయ్యబడుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: