ఉద్యోగులు అన్నింటికి తెగించి చేస్తున్న ఉద్యమాన్ని పాతరేసే దిశగా ప్రభుత్వం ముందుకు పోతున్న సంకేతాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. తెలంగాణలో సకల జనుల సమ్మెను నివారించినట్టుగానే సీమాంద్రలో ఉద్యోగులు చేస్తున్న సమ్మెను నిర్వీర్యం చేసే పనికి సర్కురు శ్రీకారం చుట్టిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఓవైపు ఏపిఎన్జీఓల సంఘం ఎన్నికలయ్యేంత వరకైనా సమ్మె విరమించేది లేదు, ఉద్యమం వీడేది లేదు, ఎన్నికల్లో బుద్ది చెపుతాం అని ప్రకటిస్తున్న తరుణంలోనే కీలకమైన విద్యుత్ ఉద్యోగులను విధులకు పంపించడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. గురువారం చోటుచేసుకున్న మరో అనూహ్య పరిణామం ఆర్టీసి వ్యవహారం, ఈ రెండు సమ్మెను సంకనాకించే పనికి సర్కారు దిగింది అన్నసూచనలు జారీ చేసాయి. సమైక్య ఉద్యమం ఇంత స్థాయిలో నడుస్తోంది అంటే ఉద్యోగులే అన్నది అందరికి తెలిసిందే.

ప్రజాప్రతినిధులనెవరిని రానీయకుండా ప్రజలను వెంటపెట్టుకుని ఉద్యోగసంఘాల నేతలే ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. అలాంటి ఉద్యోగులు సమ్మె విరమిస్తే ప్రజా ఉద్యమం పూర్తిగా సద్దుమనిగినట్టే, కారణం ముందుండి నడిపించే నాయకుడు లేకుండా ఉద్యమం ముందుకు సాగదు. ఉద్యోగులు తప్పుకుంటే సాధారణ జనాన్ని లీడ్ చేసే రాజకీయేతర నాయకులు ప్రస్తుతం సీమాంద్రలో చాలా తక్కువ. ఒక మేదావుల సంఘం నాయకులు మాత్రమే మిగులుతారు, వారి ప్రభావం ఇప్పుడే అంతగా కనిపించడం లేదు, ఉద్యోగులు తప్పుకుంటే వారి ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తారన్నది చూడాలి.

లేకపోతే రాజకీయ జేఏసి ఏర్పడ ఇక ఉద్యమాన్ని రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా ముందుకు తీసుకుపోతే చెప్పలేం, కాని అది సాద్యమయ్యే పరిస్థితులు మాత్రం ఇప్పటికిప్పుడు కనిపించడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక ఉద్యోగుల సమ్మెపై  కమ్ముకుంటున్న నీలినీడలేంటో చూద్దాం, ఆర్టీసి వారు ఎన్నో ఏళ్లుగా కంటున్న కలను నెరవేర్చింది ప్రభుత్వం, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసింది. సమ్మె విరమణ ఒప్పందంతోనే ఇంతటి చారిత్రక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందంటున్నారు. అంటే ఆర్టీసి సమ్మె విరమణ నేడో రేపో అన్నట్లుగా తయారయిందంటున్నారు. నిజానికి ఆర్టీసి సమ్మెతోనే ఉద్యమం పాకాన పడింది అన్నది వాస్తవం. ఇక ఉద్యమ సెగ ఢిల్లీని వణికించింది విద్యుత్ ఉద్యోగుల సమ్మె, అదికూడా వారు గురువారం వాయిదా వేసామన్నారు, అంటే ఇప్పటికిప్పుడు విరమించారన్నమాటే. అప్పట్లో తెలంగాణలో సకలజనుల సమ్మెను ఎలాగయితే ప్రభుత్వం నిర్వీర్యం చేసిందో ఇప్పుడు కూడా అలాగే ముందుకు పోతున్నట్టు స్పష్టం అవుతోందన్న  మాట, ఇందులో విజయం సాదిస్తారా... లేదా... అనేది కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: