చూడబోతే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. లేకపోతే అద్దె కొంపను ఖాళీ చేయటానికి ఇంత యాగీ చేయాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు గాక లేదు. ఒనర్ ఇల్లు ఖాళీ చేయమంటే మనం ఏం చేస్తాం ? అవకాశం ఉంటే వెంటనే ఖాళీ చేసేస్తాం. లేకపోతే అనువైన ఇల్లు వేరేది దొరికేంత వరకూ కాస్త వ్యవధి ఇవ్వమని ఓనర్ ను అడుగుతాం. అంతేకానీ తమ ఆధీనంలోనే ఉంచుకుంటామని అడుగుతామా ? అడిగినా ఓనర్ ఒప్పుకుంటాడా ?

 

ఇక్కడే చంద్రబాబు వ్యవహారంలో అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. పేరుకే చంద్రబాబు ఉంటున్న నివాసం లింగమనేని గెస్ట్ హౌస్. కానీ ఆ గెస్ట్ హౌస్ ఎప్పుడో చంద్రబాబు సొంతమైపోయిందనే ప్రచారం కూడా జోరందుకుంది. గెస్ట్ హౌస్ సొంతం చేసుకున్నారు కాబట్టే లింగమనేనికి ప్రభుత్వం తరపున విపరీతమైన లబ్ది చేరూర్చినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

 

అంత బ్రహ్మాండమైన అక్రమ కట్టడాన్ని చంద్రబాబుకు అద్దెకు ఇవ్వటానికి లింగమనేనికి ఏమన్నా పిచ్చా ? లేకపోతే ఉత్తినే అద్దెకు తీసుకోవటానికి చంద్రబాబు ఏమన్నా అమాయకుడా ? ఇద్దరి మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగింది కాబట్టే ఆ భవనాన్ని చంద్రబాబు సొంత భవనంగానే వాడుసుకుంటున్నారట.

 

లింగమనేని నుండి భవనం చంద్రబాబు సొంతం కాగానే వాస్తు మార్పులు చేయించారు. సుమారు రూ 15 కోట్లు పెట్టి ఫర్నీచర్ ను కూడా కొనుగోలు చేయించారు. మరికొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంటీరియర్ డెకరేషన్ కూడా చేయించారు. అఫ్ కోర్స్ అదంతా ప్రభుత్వ ఖర్చుతోనే సుమా. చేసిన ఖర్చులో చంద్రబాబు జేబులో నుండి పెట్టింది రూపాయి కూడా లేదేమో ?

 

మంది డబ్బుతో చేయించుకున్న షోకులు కదా ఖాళీ చేయటానికి చంద్రబాబుకు మనసొప్పటం లేదు. అందుకే ముఖ్యమంత్రిగా ఓడిపోయినా చూరుపట్టుకుని వేలాడుతునే ఉన్నారు. సిఎంగా దిగిపోగానే ఖాళీ చేసేసుంటే గౌరవంగా ఉండేది. అక్రమ కట్టడాల్ని కూల్చేస్తామని జగన్ చెబుతున్నా ఖాళీ చేయటం లేదంటే  బహుశా అది చంద్రబాబు సొంతమే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: