మోడీ 1.0 ప్రభుత్వం అధికారంలో ఉండగా జయశంకర్ విదేశాంగ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.  మోడీకి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు.  మోడీ చేసే ప్రతి విదేశీ ప్రయాణంలో జయశంకర్ తప్పకుండా ఉండేవారు. విదేశాంగ విధానంలో ఆయన సలహాలు సూచనలు తీసుకునేవారు.  జయశంకర్ పనితనం నచ్చిన మోడీ, తన 2.0 ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా పదవిని ఇచ్చి ఆయన్నే కాకుండా ఏకంగా దేశ ప్రజలను సైతం ఆశ్చర్యపోయెలా చేశారు. 


కాగా, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చివరకు బీజేపీలో చేరారు. జైశంకర్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ అధికారికంగా బీజేపీ సభ్యత్వం పొందారు 64 ఏళ్ల జైశంకర్ 2013 నుంచి 2015 వరకు అమెరికాలో భారత రాయబారిగా ఉన్నారు. ఆయనను నిపుణుడైన దౌత్యవేత్త, సంధానకర్తగా గుర్తిస్తారు.ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు కూడా ఆయన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. జైశంకర్ ను మంత్రిని చేయడం అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు ఇతర మంత్రులను కూడా నివ్వెరపరిచింది. ఎస్ జైశంకర్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడిగా భావిస్తారు. ఆయన చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందారు. 2014లో నరేంద్ర మోడీ మొదటిసారి బాధ్యతలు చేపట్టినపుడు ఆయనను ప్రత్యేకంగా విదేశాంగ కార్యదర్శిగా నియమించారు. 


జైశంకర్ మొదటి నుంచి ప్రధాని మోడీకి ఇష్టుడిగా మెలిగారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టక ముందు నుంచి జైశంకర్ కి ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి. దీని ప్రారంభం చైనాతో జరిగింది. 2012లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా చైనా పర్యటనకు వెళ్లారు. అప్పుడు జైశంకర్ అక్కడ భారత రాయబారిగా పనిచేస్తున్నారు. ఆయన 2009 నుంచి 2013 వరకు చైనాలో భారతీయ రాయబారి పని చేశారు. 


చైనాతో 73 రోజుల పాటు సాగిన డోక్లాం వివాదం పరిష్కారంలో కూడా జైశంకర్ కీలకపాత్ర పోషించారు. అంతకు ముందు 2010లో చైనా ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజలకు స్టేపల్ వీసా ఇచ్చేవారు. ఈ విధానాన్ని మార్పించడంలో జైశంకర్ ప్రధానపాత్ర పోషించారు.  దౌత్య విధానంలో జయశంకర్ ది అందెవేసిన చేయి.  అందుకే ఆయన్ను ఏరికోరి విదేశాంగ శాఖ మంత్రిగా నియమించారు.  మంత్రిపదవికి పొందిన తరువాత లోక్ సభకు కానీ, రాజ్యసభలో కానీ మెంబర్ కావాల్సి ఉంటుంది.  అందుకే జయశంకర్ బీజేపీలో జాయిన్ అయ్యారని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: