కలెక్టర్ల సదస్సు తొలిరోజునే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.   రచ్చబండ కార్యక్రమం ద్వారా తండ్రి తరహాలోనే  ప్రజా సమస్యలు ఎక్కడిక్కడే పరిష్కరించ వచ్చునని  జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు . రచ్చబండ కార్యక్రమాన్ని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టాలనుకున్న  విషయం తెల్సిందే .   రెండవసారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వైఎస్ పాలనను పరుగులు పెట్టించాలని వైఎస్  యోచించారు. దానికోసం రచ్చబండ కార్యక్రమాన్ని వేదికగా చేసుకోవాలని భావించారు . అయితే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వెళ్తూ ఆయన హెలికాఫ్టర్ ప్రమాదానికి గురయ్యారు .


వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను ఏ కార్యక్రమాన్ని చేపట్టినా  సెంటిమెంట్ గా రంగారెడ్డి జిల్లా లోని చేవెళ్ల నుంచి ప్రారంభించేవారు . కానీ రచ్చబండ కార్యక్రమాన్ని  చిత్తూరు నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ రోజు  వాతావరణం సరిగా లేకపోవడం తో , హెలికాఫ్టర్ లో ముఖ్యమంత్రి  ప్రయాణానికి   ఏ టి సి అధికారులు అభ్యంతరం చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి .  వైఎస్ మాత్రం వారి అభ్యంతరాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదని, దానికి కారణం లేకపోలేదని వైఎస్ సన్నిహితులు  అంటుంటారు .  తన మనస్సు నుంచి పుట్టుకొచ్చిన రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ధృడసంకల్పం వల్లే ఆయన  ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా ఖాతరు చేయకుండా చిత్తూరుకు పయనమై , ప్రమాదానికి గురయ్యారని చెబుతుంటారు .


వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ప్రభుత్వ హయం లో ఏదైతే సంకల్పం తో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం ఎక్కడిక్కడే ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: