పాక్ తీవ్రవాదులు ఇండియన్ ఆర్మీ వాహనాలపై పుల్వామాలో జరిపిన దాడి కారణంగా అనేక మంది మరణించారు.  ఆర్మీ జవానులు మరణానికి బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది.  ఈ హెచ్చరికను పాక్ తేలిగ్గా తీసుకుంది.  పెద్దగా పట్టించుకోలేదు. ఇండియా మాత్రం సైలెంట్ గా సర్జికల్ స్ట్రిక్స్ ను నిర్వహించింది.  పాక్ భూభాగంలోకి వెళ్లిన ఇండియా యుద్ధ విమానాలు సైలెంట్ గా పని పూర్తి చేసి వచ్చేశాయి.  


అనంతరం పాకిస్తాన్ ఇండియా భూభాగంలోకి చొచ్చుకు వచ్చి దాడి చేయాలని చూసింది.  కానీ, సాధ్యపడలేదు.  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధవిమానాలు పాక్ యుద్ధ విమానాలను తరిమికొట్టాయి.  ఈ సమయంలో పాకిస్తాన్ ఆర్మీ జరిపిన క్షిపణి దాడిలో మిగ్ 21 విమానం కూలిపోయింది.  అయితే, ఫైలట్, వింగ్ కమాండర్ అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కాడు.  ఆ తరువాత తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.  


ఇదిలా ఉంటె, అభినందన్ ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ..  భారతీయ వాయు సేన పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మీసాలను జాతీయ మీసాలుగా ప్రకటించాలని లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురీ డిమాండ్ చేశారు. అలాగే అభినందన్ కు ఆయన సాహసానికి గుర్తింపుగా పురస్కారం అందజేయాలని కోరారు. పాకిస్థాన్ లో తను నడుపుతున్న మిగ్-21 విమానం కూలిపోవడంతో బందీగా పట్టుబడ్డ అభినందన్ వర్థమాన్, రెండు రోజుల్లో తిరిగి వచ్చారు.

ఈ సందర్భంగా అభినందన్ మీసాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.విమానాన్ని పాక్ దళాలు కూల్చేయడంతో అభినందన్ బందీగా చిక్కారు. శాంతి సూచనగా రెండు రోజుల తర్వాత వింగ్ కమాండర్ ను పాకిస్థాన్ విడుదల చేస్తున్నట్టు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీ సంయుక్త సమావేశాల్లో ప్రకటించారు. భారత్-పాక్ ల మధ్య పరిస్థితి చేతులు దాటిపోరాదని ఈ చర్య చేపడుతున్నట్టు తెలిపారు. మార్చి 1, 2019న అభినందన్ వర్థమాన్ విడుదలయ్యారు. సర్జికల్ స్ట్రైక్స్ ను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ సఫలం అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: