గ్రామ వలంటీర్‌ నియామకానికి తొలిరోజే 34735 మంది ధరఖాస్తు
ప్రతిపక్ష నేతల విమర్శలను పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన గ్రామ వలంటీర్‌ నియమకానికి విశేష స్పంధన లభిస్తోంది. తొలి రోజే (24 జూన్‌ 2019) 34,735 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో గ్రామ వలంటీర్‌ నియామకానికి ధరఖాస్తు చేసుకున్నారు.  ఇందులో ప్రధానంగా కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 3,934 మంది ధరఖాస్తు చేసుకున్నారు. 


వైసిపి కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకే గ్రామ వాలంటీర్ల నియామకాలు చేపట్టారంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపణలకు ఆన్‌లైన్‌ విధానం చెంపపెట్టైంది. 50 కుటుంభాలకు ఒకరు చొప్పున రాష్ట్రంలోని 5 కోట్ల మంది జనభాకు సేవలందించేందుకు ముఖ్యమంత్రి చేపట్టిన ఈ గ్రామ వలంటీర్‌ నియామకం ద్వారా నాలుగు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధిని చూపనున్నారు.


జిల్లా పేరు - నమోదైన దరఖాస్తులు
అనంతపురం - 2708
చిత్తూరు - 2876
తూర్పు గోదావరి - 3301
గుంటూరు - 3170 
కృష్ణా - 2521
కర్నూలు - 3934
ప్రకాశం - 2495
నెల్లూరు - 1454
శ్రీకాకుళం - 2539
విశాఖపట్నం - 3184
విజయనగరం - 1750
పశ్చిమ గోదావరి - 2366
వైఎస్‌ఆర్‌ కడప - 2437
మెత్తం - 34735


"బాబు వస్తే జాబు" అనే నినాదం ఇచ్చి మోజగించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానాలకు చమరగీతంగా... ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన గ్రామ వలంటీర్‌ నియామకం నాలుగు లక్షల మంది కుటుంభాలకు ఆసరాగా మారనుంది. అదే విధంగా రాష్ట్రంలోని 5 కోట్ల మందికి ప్రభుత్వ సేవలు చేరువకానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: