అమ్మ ఒడి పథకంపై అనేక భిన్న కథనాలు , అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.  ప్రైవేటు పాఠశాలల్లో ఈ పథకం పెట్టినట్టైతే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి పెరిపోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ ఉపాధ్యాయుడి ఆవేదన ఇలా ఉంది... 

"అమ్మ ఒడి" పధకంపై ప్రభుత్వ ఉపాధ్యాయులేమీ భయపడాల్సిన పనిలేదు. ఉద్యోగాలు తీసేస్తారా ఏంటి? ఉద్యోగాలు ఎక్కడికీ పోవు. కాకపోతే ప్రభుత్వ‌ విద్యా వ్యవస్థపై పెంచుకున్న మమకారం, ప్రేమతో నిర్మించుకుంటున్న వ్యవస్థ ఎక్కడ కూలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ పాఠశాలలు మూతపడితే వేరే శాఖలోనో ఎందులోనో పనిచేస్తారు.


డి.ఎస్.సి‌. కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు అంటే ప్రైవేటు పాఠశాలల్లో 4000/- రూ.లకో, 5000/-రూ.లకో పనిచేస్తున్న ఉపాధ్యాయులు భయపడాలి. ఎందుకంటే అమ్మ ఒడి మొదలైతే ఇక ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఉండవ్. డి.ఎస్.సి‌ ఉండదు, ఉపాధ్యాయ పోస్టుల సర్దుబాటు వలన ఇతర శాఖల్లో కూడా ఉద్యోగాలు ఉండవు. ఇక ఆ 4వేలు/ 5వేలతో జీవితాంతం ప్రైవేటు పాఠశాలలకు ఊడిగం చేయాల్సిందే.


కాబట్టి వాళ్ళూ ఇంకా అదే ప్రైవేటు పాఠశాలలను పెంచి, పోషించుకుని, తామకు కూడు పెట్టబోయే ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేసుకుంటారో? లేక ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకుని, ఉద్యోగాలు చేస్తారో వారిష్టం. ప్రైవేటు పాఠశాలల విద్యార్ధులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే, వారి పోస్టులు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులుగా మారతాయనే సింపుల్ లాజిక్ లా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: