చంద్రబాబు ముఖ్యమంత్రిగా  ఉన్న అయిదేళ్ళ కాలంలో జరిగిందేంటో అందరికీ తెలుసు. . ఇపుడు జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఏర్పడింది. మరి జగన్ ఏపీ ప్రజల కష్టాలను పాదయాత్ర ద్వారా అర్ధం చేసుకుని అధికారంలోకి వచ్చిన వారు. జగన్ని ముఖ్యమంత్రిగా చేసిన అనేక అంశాలు ఉన్నాయి. అయితే అవి సాకారం అవుతాయా. కానిస్తారా..


జగన్ హోదా తెలేడు... ఈ మాటలు బీజేపీ వారు అనడంలేదు. ఏపీలో దారుణంగా ఓడిపోయిన తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దే రామ్మోహనరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వీళ్ళంతా హోదా రాదని ముందే చెప్పేస్తున్నారు. హోదాని ఎపుడు తెస్తారో చెప్పాలని కేసినేని నాని జగన్ని డిమాండ్ చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి పాతిక  రోజులు కూడా కాలేదన్నది ఆయన మరచిపోయారు. ఇక గద్దె రామ్మోహన్ అయితే హోదా ఇవ్వరని పక్కాగా తేల్చేశారు.


 గంటా వంటి వారు హోదా జగన్ కూడా తేలేరని కచ్చితంగా చెప్పేస్తున్నారు. వీరందరితో పాటు టీడీపీ ఫిరాయించి బీజేపీలో చేరిన కొత్త పూజారి సుజనా చౌదరి తన తొలి పలుకుల్లోనే హోదా ముగిసిన అధ్యాయమని అనేశారు. మరి ఏపీకి చెందిన టీడీపీ నేతలే ఇలా వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీకి ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది  ఇపుడు జగన్ హోదా విషయంలో గట్టిగానే ఉన్నారు. అయితే ఆయనకు టీడీపీ సహకరించే అవకాశాలు అసలు లేవు. ఇదీ ఏపీ ప్రజలు చేసుకున్న పాపం.


మరింత సమాచారం తెలుసుకోండి: