జగన్.. తుగ్లక్ నిర్ణయాలు వద్దు..

 

 

ప్రజావేదిక భవనం కూలగొట్టడం తుగ్లక్ చర్య అని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.  వచ్చిన అధికారాన్ని నిర్మాణానికి వినియోగించండి..వి తెగపడితే రాష్ట్రానికి, ప్రజలకు కీడు చేసినవాళ్లు అవుతారని జగన్ ను హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే....

 

‘ప్రజా వేదిక’ అన్నివర్గాల ప్రజల వేదిక.. అందుకే దానిని నిర్మించింది. ఆ పేరు దానికి పెట్టింది అందుకే.. ప్రజోపయోగమైన భవనాన్ని కూలగొట్టమనడం తుగ్లక్ చర్య.ఇలాంటి నిర్ణయాలతో సియం జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ ను గుర్తు తెచ్చారు.

 

 నిర్మాణం కోసం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. అంతే తప్ప కూలగొట్టమని  కాదు మీకు ఓట్లు వేసింది. కొత్త భవనాలు నిర్మించడంపై దృష్టి పెట్టకుండా ఉన్నవాటిని ఊడకొట్టడం సరైన చర్య కాదు. ప్రజావేదిక కూలగొట్టాలనే నిర్ణయాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతలు తెలుస్తున్నాయి.

 

 రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమంపై దృష్టి కన్నా విధ్వంసంపైన పెట్టడం దురదృష్టం.ఈ విధమైన చర్యలు దిగజారుడుతనానికి నిదర్శనం. వున్న నిర్మాణాలను సక్రమంగా వినియోగించుకుని కొత్త నిర్మాణాలు నిర్మించాలి. అంతే తప్ప ఉన్నవాటిని కూలగొట్టడం తుగ్లక్ చర్యకాక ఏమనాలి..?

 

ప్రజావేదిక భవనం అలాగే ఉంటే ఎక్కడ ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖకు జవాబివ్వాల్సి వస్తుందో, అనే దుగ్దతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంది. నెల రోజుల పాలనలోనే ఈ విధమైన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే రాబోయే కాలంలో ఇలాంటి విధ్వంసక చర్యలు మరెన్ని చేపడతారో అనే భావన సర్వత్రా ఉంది అన్నారు యనమల రామకృష్ణుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: