అసలు పవన్ రాజకీయాల్లో పనికి వస్తారా లేదా అనే చర్చలు నిన్నటి వరకు జరిగాయి.  ప్రజారాజ్యం బాటలోనే జనసేన కూడా నడుస్తుందని... అయితే, ప్రజారాజ్యం కొన్ని స్థానాలు గెలిచి కొంతవరకు నిలబడినా తరువాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది.  కానీ, జనసేనకు ఒక్క స్థానం మాత్రమే రావడంతో జనసేనను మూసేస్తారని వార్తలు వచ్చాయి.  


ఎవరూ ఊహించని విధంగా జనసేన పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యింది.  పార్టీ విధానాలను ప్రకటించింది.  కార్యకర్తల స్థాయి నుంచి ఎదగాలని నిర్ణయించింది.  క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే.. విజయం సాధించగలమని నిరూపించింది. 


అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసింది.  త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని నిలబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  పార్టీ వాయిస్ ను గ్రామాల్లో బలంగా వినిపించాలని కమిటీలకు సూచించారు.  కమిటీలు క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ.. బలోపేతం చేయాలని తద్వారా వచ్చే ఎన్నికలకు సిద్ధం కాగలమని పవన్ అంటున్నారు.  


ఏడాది వరకు జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడబోమని, ముందు తమ పార్టీ బలం పుంజుకోవడంపైనే దృష్టిపెడతామని పవన్ అంటున్నాడు.  కరకట్ట విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.  ఒక్క ప్రజావేదిక విషయంలోనే కాకుండా కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నింటిని కూల్చివేయాలని, అప్పుడు జగన్ పై ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: