ప్రజావేదిక అక్రమ కట్టడమని దానిని కూల్చేయబోతున్నామని ఎపి సీఎం జగన్ చెప్పిన సంగతీ తెలిసిందే. అయితే టీడీపీ నాయకులూ దీని మీద వితండవాదం మొదలు పెట్టారు. పోలవరంకు , ప్రజావేదికకు లింక్ పెట్టి మాట్లాడటం చూసి వేరని ఏమని అనాలో అర్దం కాని పరిస్థితి. టీడీపీ నాయకుల అర్ధం పర్ధం లేని ఆరోపణలతో ఉన్న పరువును పోగొట్టుకుంటున్నారని భావించాలి. 


 నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదికను కూల్చేయాలని వైఎస్‌ జగన్‌ ఆదేశిస్తే, పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. దాన్నీ కూల్చేస్తుందా.? అంటూ అడ్డగోలు వాదనకు తెరలేపారు మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. 


పోలవరం ప్రాజెక్టుకి అన్ని అనుమతులూ దాదాపుగా లభించినట్లే. ప్రజా వేదిక విషయంలో మాత్రం నిబంధనలకు నీళ్ళొదిలింది చంద్రబాబు సర్కార్‌. పైగా, సగానికి సగం నిధుల్ని అప్పటి అధికార పార్టీ పెద్దలు మింగేశారన్నది కదా.. ఇప్పుడు ప్రధాన ఆరోపణ. దానిపై సమాధానం చెప్పకుండా చంద్రబాబుపై కక్ష.. పోలవరం ప్రాజెక్టునీ కూల్చేస్తారా.? లాంటి పసలేని విమర్శలు చేయడమేంటో టీడీపీ నేతలకే తెలియాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: