జగన్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారం చేసిన అంశం ప్రత్యేక హోదా.  గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి జగన్ ప్రత్యేక హోదా నినాదాన్ని భుజాన వేసుకొని ప్రతి ఊరు తిరిగారు.  ప్రతి ఇంటికి వెళ్లారు.  ప్రత్యేక హోదా తీసుకురావడానికి సహకరించారాలని కోరారు.  


అనుకున్నట్టుగా ప్రజలు సహకరించి అధికారం ఇచ్చారు.  ఇప్పుడు జగన్ ముందున్న అతి పెద్ద లక్ష్యం అదే.  ప్రత్యేక హోదా తీసుకురావాలి.  కానీ, కేంద్రం మాత్రం ఈ హోదా ఇచ్చేందుకు సిద్ధంగా లేదని స్పష్టంగా తెలుస్తోంది.  ఆంధ్రా తో పాటు, తెలంగాణా, బీహార్, రాజస్థాన్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి లేఖలు రాశాయి.  


ఒక్క ఆంధ్రప్రదేశ్ కు  ఇవ్వడం మూలంగా ఆయా రాష్ట్రాలు కూడా గొడవలకు దిగుతాయి.  పైగా ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా అన్ని వనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రం.  వీటిని సరిగా వినియోగించుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.  కేంద్రం నుంచి నిధులు అందుతాయి.  


అలా కాకుండా హోదానే కావాలి అంటే మాత్రం సాధ్యం కాదని ఇప్పటికే కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.  మరి దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.  కేంద్రం ఖరాకండిగా చెప్తున్నా ఇవ్వాల్సిందే అని పట్టుబడతారా.. లేదంటే ఈ అంశాన్ని పక్కన పెడతారా.. వాట్ నెక్స్ట్ జగన్.  


మరింత సమాచారం తెలుసుకోండి: