మాటలు చాలామంది చెబుతారు. హామీలు కూడా చాలామందే ఇస్తారు. కానీ ఇచ్చిన మాటను క్రియారూపంలోకి తీసుకురవాలంటే చాలామంది వల్ల కాదు. కానీ చెప్పిన మాటను, ఇచ్చిన హామీని అమల్లోకి తేవటంలో చాలామందికి జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాను మాటల మనిషిని కానని చేతల మనిషిగా నిరూపించుకుంటున్నారు.

 

తాజాగా ప్రజావేదిక కూల్చివేతకు జగన్ ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా చంద్రబాబునాయుడు అక్రమ కట్టడాల్లో ఉంటున్నారంటూ ఎన్నోసార్లు జగన్ అండ్ కో ఆరోపించారు. అలాంటిది తాను అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చివేయాలని ఆదేశించారు.

 

పాదయాత్రలో కానీ ఎన్నికల సమయంలో కానీ జగన్ అనేక హామీలిచ్చారు. వాటి అములుకు కూడా జగన్ చాలా వేగంగా పనిచేస్తున్నారు. తానిచ్చిన హామీల  అమలుకు టైంబౌండ్ పెడుతున్నారు. దాని ప్రకారమే పథకాలు గ్రౌండ్ కావాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని హామీలు అమల్లోకి వచ్చేశాయి.

 

నిజానికి మొన్నటి వరకూ చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు హామీల అమలును ఎలా తుంగలో తొక్కింది అందరికీ అనుభవమే. జగన్ ఇచ్చిన హామీలు కూడా అలాంటిదే అని అనుకున్నారు. కానీ చంద్రబాబుకన్నా తాను ఏ విధంగా భిన్నమైన ముఖ్యమంత్రో చేతలతోనే జగన్ స్పష్టం చేస్తున్నారు.

 

కలెక్టర్ల సమావేశంలో కూడా అదే విషయాన్ని జగన్ స్పష్టం చేశారు. తాను ఆచరిస్తున్న పద్దతినే  కలెక్టర్లు కూడా ఫాలో అవ్వాలని సున్నితంగానే హెచ్చరించారు. తన ప్రాధాన్యతలేంటో చెబుతునే కలెక్టర్లు ఎలా ఫాలో అవ్వాలో కూడా సూచనలు చేశారు. జనాలతో నేరుగా సంబంధాలు పెట్టుకోమని ఆదేశించారు. వారంలో ఒక్కరోజు క్షేత్రస్ధాయి పర్యటనలు చేయమన్నారు. సమస్యల పరిష్కారం కోసం, జనాలను నేరుగా కలుసుకునేందుకు ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే పెట్టుకోమన్నారు. మొత్తానికి జగన్ అంటే మాటలు చెప్పటం కాదు చేతల మనిషిగా నిరూపించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: