జగన్ సీఎం, అధికారులు ఆయన ఆదేశాలు కచ్చితంగా పాటించాలి, ఇక మంత్రులు ఆయన నియమించుకున్న వారే వారు సైతం విధేయులుగా ఉండాల్సిందే. జగన్ సర్వాధికారి. ఆయన నంది అంటే అది నందే అవుతుంది. రెండవ వాదనకు తావు లేదు. కానీ మరీ ఇంతలాగానా...



మరి జగన్ కి అధికారులు, మంత్రులు ఎందుకు దండం పెడుతున్నారంటే. ఆయన చేతి  వాటం కాస్తా తగ్గించుకొమ్మనిట. జగన్ మాటకు వస్తే వారికి ఇంత జీతాలు, వీరికి ఇంత జీతాలు అంటూ ఒక్కసారిగా  పెంచేస్తున్నారు. ఆయన చేతికి ఎముక లేనట్లుగా హామీలు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే నవరత్నాలు అమలు ఎలా అని ప్రభుత్వ పెద్దలు తలపట్టుకుంటున్నారు.


ఓ వైపు చంద్రబాబు ఖజానాని ఖాళీ చేసి పెట్టి వెళ్ళారు. జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది. ఈ సమయంలో జగన్ మరీ దూకుడుగా అక్కడికక్కడే నిర్ణయాలు చేయడం, కనీసం అధికారులు, మంత్రులతో కూడా ఆర్ధిక పరిస్థితి గురించి చర్చించకుండా వెంటనే ప్రకటనలు చేయడంతో తల పట్టుకుంటున్నారుట.


తాజాగా పాఠశాల‌ల్లో పనిచేసే పారిశుధ్యం కార్మికులకు జీతం 18 వేల రూపాయలు ఇద్దామని జగన్ ప్రతిపాదిస్తే వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కలుగచేసుకొని ఇపుడున్న పరిస్థితుల్లో కష్టం సర్ అంటూ దండం పెట్టేశారుట. ఆ తరువాత ఆర్ధిక  మంత్రి బుగ్గన రాజేంద్రరెడ్డి కూడా బడ్జెట్ సరిపోదు అంటూ జగన్ కి నచ్చచెప్పారుట. మరి జగన్ ఇలా దూకుడు మీద వెళ్తే ఎలా అని అపుడే అంతా డౌట్లో పడిపోతున్నారుట.


మరింత సమాచారం తెలుసుకోండి: