ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో గత అధికార పార్టీ తెలుగు దేశం దారుణమైన పరాబవాన్ని పొందారు.  175 సీట్లకు గాను వైసీపీ ఏకంగా 151 సీట్లు గెల్చుకుంది.  లోక్ సభ స్థానాలు 25 కి ఏకంగా 22 స్థానాలు వైసీపీ గెల్చుకుంది..కేవలం మూడు స్థానాలకు టీడీపీ పరిమితం అయ్యింది.  సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చారు.  అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మొన్నామద్య మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన వెళ్లిన విషయం తెలిసిందే.


గడచిన వారం రోజులుగా లండన్ లో తన కుటుంబంతో విహారంలో ఉన్న చంద్రబాబునాయుడు, నేడు హైదరాబాద్ కు రానున్నారు. తన పర్యటనను ముగించుకున్న ఆయన గత రాత్రి విమానంలో బయలుదేరారు. నేడు ఇండియాకు రానున్న ఆయన, రేపు అమరావతికి వెళ్లనున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లాక టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో పాటు నలుగురు పార్టీ ఫిరాయించారు.


వీరితో పాటు మరింత మంది ప్రజా ప్రతినిధులు టీడీపీని వీడుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి రాజకీయ వ్యూహాత్మక అడుగులు వేస్తారన్న విషయమై చర్చ సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: