ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య తీవ్రమవుతున్న విషయం తెలిసిందే.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రోడ్డు ప్రమాదంలో గాయపడటం..చనిపోవడం జరుగుతుంది.  పట్టణాల్లో కీలకమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నా ఏదో ఒక మార్గం ద్వారా తాగుబోతు రాయుళ్లు తప్పించుకోవడం..ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగడం అవుతుంది. 

డ్రైవర్లనిర్లక్ష్యం..అతి వేగం రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలు అవుతున్నాయి. తాజాగా డ్రైవింగ్ చేస్తున్నవారు ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి కొత్త విధానాలు అమలు పరుస్తున్నారు.  ఈ రూల్స్ పాటించని వారికి భారీగా జరిమానా..జైలు శిక్ష వేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది. 


- లైసెన్స్ లేకుండా నడిపితే - రూ.5000
-అతి వేగంగా నడిపితే - రూ.2000
-ప్రమాదకరంగా నడిపితే - రూ.5000
- మద్యం మత్తులో నడిపితే (డ్రంకెన్) - రూ.10,000
- హెల్మెట్ లేకండా నడిపితే - రూ.1000+  నెలలు డ్రైవింగ్ సస్పెన్షన్
- ద్విచక్ర వాహనంపై వెనుక ఉన్నవారు -హెల్మెట్ ధరించకపోతే - రూ.1000
-ఇన్సూరెన్స్ చేయించపోతే - రూ.2000
-అంబులెన్స్ కి దారివ్వకపోతే - రూ.10,000
- అనర్హలని తేల్చినా వాహనం నడిపితే - 10,000
- పిల్లలు నడిపితే సంరక్షకులకు శిక్ష - రూ.25 వేలు + 3 ఏళ్లు జైలు  +లైసెన్స్ రద్దు 
- ఆదేశాలు ఉల్లంఘిస్తే  - రూ.2000
- సీటు బెల్టు ధరించకపోతే - రూ.1000
-ఓవర్ లోడింగ్ చేస్తే  - రూ.20,000
-ఎగ్రిగేటర్స్ (ఓలా,ఊబర్ లాంటివి) - రూ.1,00,000
-లైసెన్స్ ఉల్లంఘనకు పాల్పపడితే 

ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘిస్తే - జరిమానా రెట్టింపు 

మరింత సమాచారం తెలుసుకోండి: