కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని దాడులకు ప్రతి దాడులే సమాధానం అని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ పేర్కొన్నారు. సోమవారం రాత్రి గుడ్లవల్లేరు మండల టీడీపీ కార్యాలయం ఆవరణలో కార్యకర్తల సమావేశం జరిగింది. దేవినేని అవినాష్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఒక చెంపకొడితే మరో చెంప చూపే రోజులు మారాయని, ఒక చెంప కొడితే రెండు చెంపలు కొట్టే రోజులివన్నారు.

 

టీడీపీ కార్యకర్తలపై రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయంగా కేసులు పెడితే పోరాడతామ న్నారు. 22 రోజుల్లోనే నవరత్నాల ప్రాధాన్యం తెలిసిపోయిందన్నారు. అప్పుడే మొదటి రత్నం రాలి పోయిందన్నారు. ఎన్నికల ముందు రూ. మూడు వేలు పెన్షను ఇస్తామని, ప్రమాణాస్వీకారం రోజున రూ.2250కి కుదించారన్నారు.

 

అమ్మ ఒడిపై ముందు చెప్పిందొకటి తరువాత చేయబోయిందొకటయితే ప్రజల్లో వ్యతిరేకత రావడంతో మళ్లీ సరిదిద్దుకున్నారన్నారు. స్థానిక సంస్థల పోరుకు సన్నద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జీ రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు ఏదో ఆశపడ్డారు ఒకసారి అవకాశం ఇద్దామని చూశారు. టీడీపీ ఎంతో చేసింద న్నారు. పార్టీ కోసం అందరం కలిసి పని చేద్దామన్నారు.

 

చంద్రబాబును అసెంబ్లీలో, బయట ఎంత హేళన చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్టీ కార్యకర్త అన్నే వెంకటరావు చంద్రబాబును అసెంబ్లీకి వెళ్లోద్దని తన ఆవేదనను సమావేశంలో వెళ్లిబుచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా జూన్‌ 10వ తేదీ నాటికే పట్టిసీమ నుంచి నీళ్లిచ్చాం. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో అర్థం కావడం లేదు. అని ఎద్దేవా చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: