మెగాస్టార్ చిరంజీవి బిజెపిలోకి  వెళ్ళబోతు న్నారా...?  ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఆయన  త్వరలోనే కాషాయం కండువా  కప్పుకుంటారా  ?  ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తోంది.

 

ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోవాలని భావిస్తున్న బిజెపి...  పార్టీలో చేరికలపై కొన్నాళ్లుగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే టిడిపిని టార్గెట్ చేసి నలుగురు రాజ్యసభ సభ్యులను  తన పార్టీలో కలిపేసుకుంది.  టిడిపి నుంచి ఇంకా మరికొందరు నేతలు జంపింగ్ కి రెడీ గా ఉన్నారు.

 

ఈ నేపథ్యంలో  చిరంజీవిని కూడా బీజేపీలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  కాకినాడలో ఇటీవల చాలామంది కాపు నేతలు సమావేశమై బిజెపిలో చేరే విషయమై చర్చించారు.  చిరంజీవి బిజెపి లో చేరితే కాపు నేతలు పెద్ద ఎత్తున ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది.

 

అయితే చిరంజీవి  బిజెపిలో చేరికపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  ఇప్పటికే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు.  కాంగ్రెస్ లోకి చేరినా  పెద్దగా క్రియాశీలకంగా లేరు.  మావయ్యకు తమ్ముడు జనసేన పార్టీ పెట్టాడు.  ఈ నేపథ్యంలో చిరంజీవి బీజేపీలో చేరతారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: