ఒక రాజ్యానికి రాజు అయితే అతని ధీమా ఏ రేంజ్ లో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  అంతా తనకింది వారే..నేనేం చేసినా నన్ను అడిగేవారు..ప్రశ్నించే వారు ఎవరు అన్న నిర్లక్ష్యం..బలుపు..మొండి ధైర్యం ఉంటుంది.  అసలు చిన్న స్థాయి రాజకీయ నాయకుడినే ఈ మద్య కాలంలో గల్లా ఎగురవేసి జులుం చేస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.  కానీ తాను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా పరిపాలనకు తాను కొత్త తనకు సహకరించండి అంటూ మంచి మనసు చాటుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 


ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ గౌరవార్థం, ఐఏఎస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు.  ఈ నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీమణి  భారతితో కలిసి వచ్చిన జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


ఈ సందర్భంగా సీఎం జన్ మాట్లాడతుూ.. నేను కొత్తగా అధికారంలోకి వచ్చాను. నాకు అనుభవం లేదు. అన్నలూ... మీరంతా నన్ను ముందుకు నడిపించండి. రాష్ట్రం కోసం అందరం కలిసి పనిచేద్దాం. రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ది చేస్తే ప్రజలకు మనల్ని అంతగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని అన్నారు.  అధికారం నాకు కొత్త. సుబ్రహ్మణ్యం అన్న (సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం), గౌతమ్‌ అన్న (డీజీపీ గౌతమ్ సవాంగ్), మన్మోహన్‌ అన్నలు నన్ను ముందుండి నడిపించాలి. నేను తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా తప్పులు కనిపిస్తే సుబ్రహ్మణ్యం అన్న, గౌతమ్‌ అన్న గైడ్‌ చేయాలి. అందరం కలిసి పనిచేద్దాం.


ప్రజలకు మంచి చేద్దామనుకుంటన్న నాకు మీరంతా సహకరించాలి  అని జగన్‌ కోరారు. సీఎం హోదాలో ఉండి కూడా జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి ఢాంబికాలకు పోకుండా అందరితో కలిసి..అందరి సహకారం తీసుకొని ముందుకు సాగడం అనేది మంచి నాయకుడి లక్షణం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: