ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా చాలా అవసరం. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుండి 90 శాతం నిధులు గ్రాంటు రూపంలో వస్తాయి ఈ నిధులు   మన రాష్ట్రం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. మిగిలిన 10 శాతం మాత్రం అప్పు రూపంలో లభిస్తుంది. ఎక్సైజ్ డ్యూటీ, ఆదాయపు పన్నులకు నూరు శాతం రాయితీ లభిస్తుంది. అందువలన పరిశ్రమలు కూడా మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది.

 s

కానీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చే ప్రతిపాదనే లేదని చెబుతున్నారు. కేంద్ర మంత్రి ఇలా చెప్పటంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుందా రాదా అనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ వైసీపీ మాత్రం 2014 సంవత్సరం నుండి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంది.

 

ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కూడా గతంలో కంటే మెరుగ్గా ఆంధ్ర ప్రదేశ్ కు సాయం చేస్తుంది. వైసీపీ బీజేపీ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. నీతి అయోగ్ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక హోదా ఆవశ్యకతను కేంద్రానికి వివరించి చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వటానికి బీజేపీ ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న సీ ఎం జగన్మోహన్ రెడ్డిగారు ప్రత్యేక హోదా సాధిస్తాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: