'ఆంధ్రప్రదేశ్‌ ' ఎడిటర్‌ ఔట్‌ ...?
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పేరుతో మేగజైన్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ మేగజైన్‌ జూన్‌ ఎడిషన్‌ లో కొత్త ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని అవహేళన చేసేలా ఉందని, Deccan Chronicle పత్రికతో సహా  పలు న్యూస్‌ పోర్టర్లలో కథనాలు వచ్చాయి. కనీసం జగన్‌ను సీఎంగా గుర్తించేందుకు కూడా ఈ మేగజైన్‌ టీం ఇష్టపడినట్టు కనిపించలేదు.

ముఖ్యమంత్రిని అవహేళన చేసేలా ఉండడంతో పాటు తప్పుడు వ్యాఖ్యలతో మేగజైన్‌ను ముద్రించారు.
దీంతో జూన్‌ ఎడిషన్‌ను బయటకు రాకుండా నిలిపివేశారు.
దీనిపై అ పత్రిక ఎడిటర్‌ గా చెప్పుకున్న నున్నా నరేష్‌ గారు ఇచ్చిన వివరణను ఏపీహెరాల్డ్‌లో ప్రచురించిన విషయం తెలిసిందే !!

ఎడిటర్‌ తొలగింపు...
ఆంధ్రప్రదేశ్‌ మ్యాగజైన్‌ ఎడిటర్‌గా ఉండి ముఖ్యమంత్రిగా వై ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫొటో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ప్రచురించడమే కాకుండా ఎగతాళి చేసిన కందుల రమేష్‌ను కార్యాలయం నుంచి బయటకు పంపి తాళం వేసినట్టు, అమరావతిలోని జర్నలిస్టు వర్గాల ద్వారా తెలిసింది. 
రికమండేషన్‌తో భారీ జీతం
గత ప్రభుత్వ హయాంలో కీలక నేత రికమెండేషన్‌తో అత్యంత భారీ జీతంతో ఎడిటర్‌గా కందుల రమేష్‌ చేరారు. ఆ నాటి నుంచి ఇంగ్లీష్‌, తెలుగు ఎడిషన్లను పర్యవేక్షిస్తూ మాగజైన్‌లో ప్రభుత్వ కార్యకలాపాలను ప్రచురించేవారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత, జగన్‌ సీఎం అయిన వెంటనే వెలువడిన తొలి ఎడిషన్‌ను బ్లాక్‌ అండ్‌ వైట్‌ కవర్‌ పేజీతో లో ముద్రించారు.

జగన్‌ ప్రమాణస్వీకార ఫొటోను నలుపు రంగులో అచ్చేశారు. జగన్‌ అనే నేను అని సీఎం ప్రమాణస్వీకారం చేస్తే మేగజైన్‌లో హెడ్‌లైన్‌ను 'జగన్‌ అనే అతడు' అని పెట్టడం ద్వారా ఎడిటోరియల్‌ టీం అసహనాన్ని ప్రదర్శించింది. ఈ మేగజైన్‌ను చూసి జగన్‌ కూడా షాక్‌కు గురైనట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై చులకన రాతలు రాయడంపై సీఎంవో తీవ్ర ఆగ్రహం, వ్యక్తం చేసినట్టు తెలిసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: