ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది.  2014, 2019 ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. తెలంగాణాలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది.  గత ఎన్నికల్లో 19 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నుంచి 12 మంది ఇప్పటికే తెరాస లో చేరిపోయారు.  


ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో... తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  త్వరలోనే అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి.  అయితే, తెరాస పార్టీలోకి ఎలాగైతే వలసలు జరుగుతున్నాయో.. అటు బీజేపీ వైపుకు కూడా వలసలు అలానే జరుగుతున్నాయి.  


తెలంగాణా టిడిపి నుంచి గరికపాటి బీజేపీలో జాయిన్ అయ్యారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాడు.  కాగా, తెలంగాణాలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డికి బీజేపీ గాలం వేస్తోంది.  


ఎలాగైనా రేవంత్ ను బీజేపీలోకి లాగాలని చూస్తోంది.  ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే.. కీలకమైన పదవి ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. తెలంగాణా బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.  మరి ఏం జరుగుతుందో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: