రాష్ట్రంలో సంచ‌ల‌నాల‌కు కేరాఫ్‌గా మారిన వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌తిప‌క్షం టీడీపీ నాయ‌కులు కారాలు, మిరి యాలు నూరుతున్నా.. ప్ర‌జ‌లు మాత్రం స్వాగ‌తిస్తున్నారు. ``అదిరింది జ‌గ‌న్‌`` అనేకామెంట్ల‌తో సోష‌ల్ మీడియాను దున్నే స్తున్నారు. సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన పాతిక రోజుల్లోనే అనేక సంచ‌ల‌నాల‌కు జ‌గ‌న్ వేదిక గా మారారు. వీటిలో ప్ర‌ధానంగా ప్ర‌త్యేక హోదా, అవినీతిపై పోరాటం, ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం, అధికారుల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డం అనేది కీల‌క అంశాల ప్రాతిప‌దిక‌గా జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. 


ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికి రెండు సార్లు ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన స‌మావేశాల‌కు వెళ్లిన జ‌గ‌న్‌.. ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని బ‌లంగానే వినిపించారు. నిజానికి ఈ రేంజ్‌లో ఏపీ ప్ర‌భుత్వం నుంచి హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. ఇప్పుడు జ‌గ‌న్ న‌యానే అడిగినా.. బ‌లంగానే కేంద్రాన్ని ఇరుకున పెడుతున్నారు. త‌న ఎంపీల‌తోనూ తాజాగా పార్ల‌మెంటు ప్ర‌శ్నించేలా చేశారుజ‌గ‌న్‌. ఇక‌, రాష్ట్ర విష‌యాల‌కు వ‌స్తే.. అవినీతి అల‌వాటు ప‌డిన ప్ర‌బుత్వ కార్యాల‌యాల‌ను, అధికారుల‌ను లైన్లో పెడుతున్నారు. 


తాజాగాఆయ‌న క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించి, ప్ర‌భుత్వ ప్రాధాన్యాల‌ను వివ‌రించారు. తాను ఏం చేయాల‌ని అనుకుంటున్నారో.. దానిని సూటిగా సుత్తిలేకుండా చెప్పుకొచ్చారు. ప్ర‌తి ప్ర‌భుత్వ ప‌థ‌క‌మూ అర్హుడైన ప్ర‌తి ఒక్క‌రికీ పార్టీల‌తో తేడాలేకుండా అందించాల‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన అనేక ప్రాజెక్టుల్లో అవినీతి పారింద‌ని, దీనిని ప‌ట్టుకుని ప్ర‌జ‌ల ముందు ఉంచ డంతోపాటు ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం కాకుండా చూద్దామ‌ని కూడా జ‌గ‌న్ వెల్ల‌డించారు. తాను ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల తాలూకు మేనిఫెస్టోను పూర్తిగా అమ‌లు చేయాల్సిన బాధ్య‌త క‌లెక్ట‌ర్ల‌పైనే ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. 


ప్ర‌జ‌ల‌కు - ప్ర‌భుత్వం మ‌రింత చేరువ అయ్యేందుకు కృషి చేయాల‌ని, జ‌వాబు దారీత‌నం ఉండాల‌ని కూడా జ‌గ‌న్ చెప్పారు. ఇలా ఒక్క ఛాన్స్ ఇస్తేనే జ‌గ‌న్ విజృంభిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు పార్టీల‌కు అతీతంగా ఫిదా అవుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ జ‌గ‌న్‌ను ఇప్ప‌టికే మంచి ముఖ్య‌మంత్రి అని కీర్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో మ‌రింత దూకుడుగా వెళ్తే.. ఆయ‌న‌కు తిరుగులేద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: