రాజకీయాలు విచిత్రంగా ఉంటున్నాయి. తమ పార్టీలో ఉన్నపుడు ముత్యాల్లాంటి నేతలు పార్టీ ఫిరాయించగానే అత్యంత అవినీతి పరులైపోయారు. ఇపుడు టిడిపి-బిజెపిల మధ్య జరుగుతున్న మాటల యుద్దం చూస్తుంటే అందరికీ అదే విషయం అర్ధమైపోతోంది. ఇటు టిడిపి అటు బిజెపి నేతల మాటల యుద్ధంలో అందరికీ అర్ధమైందేమిటంటే పార్టీ ఫిరాయించిన వారు అవినీతిపరులే అని.

 

నాలుగు రోజుల క్రితం టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ బిజెపిలోకి ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే.  ఈ నలుగురిలో వెంకటేష్ మినహా మిగిలిన ముగ్గురు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా, బినామీలుగా ముద్రపడినవారే. పనిలో పనిగా సుజనా, సిఎం రమేష్ ఇద్దరిపైన ఉన్న అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.

 

కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సిబిఐ, ఈడి, ఐటి సుజనా, రమేష్ పై చాలాసార్లు దాడులు చేశాయి. వాళ్ళిద్దరిపైన వేల కోట్ల రూపాయల ఆర్ధిక ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఏదో ఓ రోజు వాళ్ళ అరెస్టు ఖాయమని అర్ధమైపోయింది. అందుకనే హఠాత్తుగా బిజెపిలోకి ఫిరాయించారు.

 

ఇదే విషయమై టిడిపి నేతలు మాట్లాడుతూ వాళ్ళపై ఉన్న అవినీతి ఆరోపణలను తవ్వి తీస్తున్నారు. బిజెపిలోకి ఫిరాయించిన వాళ్ళు అత్యంత అవినీతిపరులంటూ మండిపడుతున్నారు. బిజెపి నేతలు ఎదురుదాడులు చేస్తు వాళ్ళ అవినీతి టిడిపిలో ఉన్నంత వరకూ నేతలకు ఎవరికీ గుర్తుకు రాలేదా ? అంటూ మండిపోతున్నారు. పైగా వాళ్ళపై కేసులున్న విషయాన్ని బిజెపి నేతలు అంగీకరిస్తున్నారు.

 

అంటే జనాలకు అర్ధమైందేమిటంటే రెండు పార్టీలు కలిసి నలుగురు ఎంపిలు అత్యంత అవినీతిపరులే అని అంగీకరించాయి. రెండు పార్టీల నేతల ఆరోపణల్లో తప్పులు కూడా ఏమీ లేవు కాబట్టి వాళ్ళ అవినీతిపై జనాలకు ఫుల్లుగా క్లారిటీ వచ్చేసింది. సరే ఫిరాయించిన వాళ్ళు ఎంతటి అవినీతిపరులైనా వాళ్ళెవరికీ జనాలతో సంబంధాలు లేదు కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళకు వచ్చిన నష్టం ఏమీలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: