బాబు రావాలి జాబు రావాలి..   గత రెండు ఎన్నికల ముందు తెలుగుదేశం నినాదం ఇది.  బాబు వచ్చాడు గాని జాబు మాత్రం రాలేదని చాలా మంది నిరుద్యోగులు నిరుత్సాహ పడ్డారు.  వైసిపి అలాంటి నినాదాలు ఇవ్వకపోయినా.. జగన్  వస్తూనే  దాదాపు  రెండు లక్షల ఉద్యోగాలు  ఇచ్చాడు.

 

గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒకటి చొప్పున రెండు లక్షల వాలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.  దీని కోసం అప్లికేషన్ స్వీకరణ కూడా ప్రారంభమైంది. అయితే ఉద్యోగం ఇచ్చే ముందే  జగన్ వారికి వార్నింగ్ ఇస్తున్నాడు.

 

కొత్తగా నియమితం కాబోయే వాలంటీర్లు  ఎలాంటి అవినీతికి పాల్పడిన తక్షణమే ఉద్యోగం వూడుతుందని  క్లారిటీగా చెప్పేశారు.  అవినీతికి దూరంగా ఉండడం కోసమే వారికి నెలకు ఐదు వేల రూపాయలు వేతనం ఇస్తున్నామని తెలిపారు.

 

ఉన్న ఊళ్ళో ఉద్యోగం,  నెలకు ఐదు వేల రూపాయల వేతనం,  గ్రామంలో అందరిలోనూ గుర్తింపు..  ఇన్ని ప్రత్యేకతలు ఉండటంతో వాలంటీర్ ఉద్యోగాల కోసం గ్రామాల్లో నిరుద్యోగులు పోటీపడుతున్నారు.  వారంతా ఒకసారి జగన్ హెచ్చరిక గుర్తుంచుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: