ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రత్యేక హోదా ఉద్యమ కేసులపై ప్రస్తావన వచ్చింది.

 

ఈ సందర్భంలో జగన్ మాట్లాడుతూ, ఇందుకు స్పందించిన వైఎస్ జగన్.. హోదా కోసం పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని ఆదేశించారు. కాగా.. గుంటూరులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట ప్లకార్డులు ప్రదర్శించినందుకు దేశద్రోహం కేసు పెట్టారన్న విషయాన్ని సదస్సులో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ప్రస్తావించారు.

 

ఇలా వ్యవహరిస్తే వ్యవస్థల మీద నమ్మకం ఏం వస్తుందని.. తక్షణమే కేసులన్నీ ఎత్తివేయాలని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈ ఐదేళ్లలో తనపై 22కేసులు పెట్టారని అప్పట్లో జగన్ మోమన్ రెడ్డి పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

 

ముఖ్యంగా.. రాజధాని భూముల విషయంలో అక్కడి రైతులకు అండగా వెళితే 8 కేసులు, హోదా కోసం ధర్నా చేస్తే 4 కేసులు ఇలా తనకు 22 కేసులు చంద్రబాబు బహుమతిగా ఇచ్చారని పాదయాత్ర బహిరంగ సభల్లో జగన్ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను వై.ఎస్.ఆర్.సి.పి చేయబోదని, అందరికి అండగా ఉంటామని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: