Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 2:03 am IST

Menu &Sections

Search

ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరిన సీఎం జగన్

ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరిన సీఎం జగన్
ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరిన సీఎం జగన్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా మంది రాష్ర్టానికి ప్రత్యేక హోదా కావాలని పోరాటాలు చేసారు. ఆ సమయంలో వారిపై కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్‌ ఉన్నతాధికారులనుద్దేశించి ప్రసంగించారు.  మంచి పాలనపై మీరు తీసుకునే నిర్ణయాల పట్ల నా పూర్తి సహకారం ఉంటుంది. అప్పుడే సుపరిపాలన అందించగలం. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని మా నాన్న నేర్పించారు. నేను కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. దేశంలోనే తొలిసారిగా ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అందించాలని నిర్ణయించాం. వారంలో​ ఒక రోజు సెలవు తీసుకుంటే... మిగిలిన రోజుల్లో ఉత్సాహంగా పనిచేయగలుగుతారు.
cm-jagan-demanding-for-status-casess
శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలేకాదు.. ప్రతి ఉద్యోగి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. పోలీస్‌ స్టేషన్లలో రిసెప్షన్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుదారులను గౌరవించేలా రిసెష్షన్‌ విభాగం ఉండాలన్నారు. త్వరలోనే పోలీస్‌ శాఖలో కొత్త నియామకాలు చేపడతాం. దళిత, బలహీన వర్గాలకు మరింత చేరువలో ఉండాలి. ఎస్పీలు ఆకస్మీక తనిఖీలు చేయాలి. బడుగు బలహీన వర్గాల దగ్గరకు వెళ్లి ఎస్‌ఐ, సీఐల పనితీరు తెలుసుకోవాలి’ అని వైఎస్‌ జగన్‌ పలు సూచనలు చేశారు. 
cm-jagan-demanding-for-status-casess
‘ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. దేశంలోనే ఏపీ పోలీస్‌ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉండాలి. చట్టాలను అమలు చేయడంలో ఎమ్మెల్యేలను కలుపుకుని పోవాలి. మానవీయ కోణంలో పోలీసులు పనిచేయాలి. ప్రజాప్రతినిధులను గౌరవించాలి. తప్పు చేస్తే ఎవరైనా ఎంతటివారైనా సహించవద్దు. పాలనా వ్యవస్థలో పోలీసులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమే. చెడ్డపేరు వచ్చే పని ఎవరూ చేయవద్దు. పర్సనల్‌ ఇగోలు పక్కనపెట్టి పనిచేయండి.
cm-jagan-demanding-for-status-casess
గత ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఇసుక మాఫియా సాగింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక దోపిడి అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై ఓ ప్రజాప్రతినిధి జుట్టు పట్టుకుని దాడి చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా మన కళ్ల ఎదుటే జరిగాయి. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది సరైన విధానమేనా? గుంటూరు జిల్లాలో అక్రమమైనింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? భూ సమీకరణ పేరుతో పోలాలు ఇవ్వని రైతులపై అక్రమ కేసులు పెట్టారు. ఎమ్మెల్యేలే బహిరంగంగా దందాలకు పాల్పడ్డారు. గ్యాంబ్లింగ్‌, పేకాట క్లబ్‌లకు ఎమ్మెల్యేలు సహకరించారు. ఇలాంటి ఘటనలపై చర్యలు లేకుంటే నంబర్‌వన్‌ పోలీస్‌ ఎలా అవుతుంది. విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయి. ఎంత మందిని అరెస్ట్‌ చేశారు.

మనమంతా కూర్చున్న ఈ వేదిక అక్రమ కట్టడమే. ఈ విషయం నిన్న కూడా చెప్పా. ఈ నిర్మాణం అక్రమమని జలవనరుల శాఖ నివేదిక కూడా ఇచ్చింది. మన కళ్లెదుటే మాజీ సీఎం అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్నారు. ప్రభుత్వమే అక్రమ కట్టడాలను నిర్మిస్తే ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్టు? ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సీఎం జగన్ తెలిపారు.


cm-jagan-demanding-for-status-casess
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పార్టీ ఫిరాయింపై స్పందించిన తోట వాణి
అధికారులకే కాదు... పార్టీ నేతలకు సీఎం జగన్ కూడా ఆదేశాలు
గందరగోళం మధ్య ఏపీ శాసనసభ
టిక్ టాక్ చేశారు... అవుట్ సోర్సింగ్ సెక్షన్ కు బదిలీ అయ్యారు
డ్రైవర్లకు ఇక ఏడాదికి రూ.10వేలు... ప్రభుత్వ సంచలన నిర్ణయం
నా కృషి వల్లే రాష్ర్టంలో పెట్టుబడులు పెరిగాయి... టీడీపీ అధినేత చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా 12 సర్కిల్ స్టేషన్లు పూర్తి... హోం మంత్రి సుచరిత
రష్మిక బ్రేకప్ గురించి వెల్లడించి విజయ్
గ్యాంగ్ లీడర్ కాదు.. గా ‘‘నాని’స్ గ్యాంగ్ లీడర్’’
ఏపీఐఐసీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఆర్కే రోజా
నిలిచిన భారతీయ వాహన నౌక
వార్షిక బడ్జెట్ పై టీడీపీ నేతలు అసంతృప్తి
శంషాబాద్ విమానాశ్రయంలో 1,300 మంది వివరాలు... ఎందుకంటే
తిరుమలేశుని దర్శనాలపై ఏపీ హైకోర్టు తీర్పు
ఢిల్లీలో నూతన ఎంపీలకు భవనాలు కరువు
రాజ్యాంగ పరంగానే నిర్ణయం తీసుకుంటా... కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్
రైల్వేను ప్రైవేటీకరణ చెయ్యం... కేంద్ర మంత్రి పియూష్ గోయల్
బాలీవుడ్ కు వెళ్ళనున్న ఓ బేబీ
''బిగ్ బాస్' కాదు.. బ్రోతల్ హౌస్ నడుపుతున్నారు..?'' షోపై విరుచుకుపడ్డ యాంకర్ శ్వేతారెడ్డి
సుజనా అస్సలు ఆగడం లేదే!
ఉదయ్ కిరణ్ బయోపిక్ నేను తియ్యను...
మరో కీలక ఘట్టానికి తెరలేపుతున్న సుజనా... బీజేపీనే చేయిస్తుందా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.