సాధారణంగా మనకు ఏదైనా గాయం అయితే వెంటనే ఆసుపత్రికి వెళ్తాం..అయితే అక్కడ ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో అని కొంత మంది రక రకాల సందేహాలు ఉంటాయి.  ఇక చిన్న పిల్లలకు గాయాలు కానీ ఇదైనా ఆరోగ్య సమస్యలు వస్తే చికిత్స చేయించుకోవడానికి మొండికేస్తుంటారు..ఏడుస్తుంటారు.  వారిని ఓదార్చలేక తల్లిదండ్రులు నానా తంటాలు పడుతుంటారు. అయితే అదే గాయం జంతువులకు అయితే..వాటి యజమానులు భద్రంగా తీసుకు వచ్చి వెటర్నరీ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తుంటారు. 

కానీ ఓ శునకం మాత్రం ఎవరి సహాయం లేకుండా తనంతట తానే వచ్చి కాలికి గాయం అయితే చికిత్స చేయించుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.  వివరాల్లోకి వెళితే, గతవారంలో ఇస్తాంబుల్ లోని ఓ వీధి కుక్క కాలికి దెబ్బ తగిలింది. వెంటనే అది పన్కనే ఉన్న బానూ సెంగిజ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఫార్మసీకి వెళ్లింది. తనకు చికిత్స చేయాల్ని చాలా దీనింగా చూడటం తో దుకాణం యజమాని వచ్చి, ఏం జరిగిందన్నట్టు చూస్తే, తన కాలిని పైకెత్తి చూపింది.

అంతకు ముందు అక్కడే ఉన్న యజమాని శునకంతో తన భాషలో తన బాధ చెప్పినట్లు కనిపిస్తుంది..వెంటనే ఆ శునకం కూడా సహాయంగా వచ్చింది. మొత్తానికి ఆ యజమాని శునకానికి చికిత్స చేశాడు...బయటకు వెళ్లే ముందు ఆ శునకం తన శైలిలో కృతజ్ఞతలు కూడా చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను అతను సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు ఆ శునకం తెలివితేటలకు తెగ మెచ్చుకుంటున్నారు.
 İstanbul’da patisi yaralanan sokak köpeği, gittiği eczanede yardım istedi. Yaralı köpeği tedavi eden Eczacı Banu Cengiz, "Yüreklerinde insan sevgisi, hayvan sevgisi, doğan sevgisi olanlar kapısına gelen bu canlıya müdahale ederdi" dedi. pic.twitter.com/rYy7OoWq1j

మరింత సమాచారం తెలుసుకోండి: