జగన్ నిర్ణయాలు ఎవరికీ అర్ధం కావడంలేదు. దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చడం పై అధికార టీడీపీ నిప్పులు చెరుగుతోంది. ఇది తుగ్లక్ చర్య అని ఘాటైన భాషను వాడేసారు మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు. అసలు జగన్ ఏం చేయాలనుకుంటున్నారని ఇతర నాయకులు ప్రశిస్తున్నారు.


అయితే జగన్ ఎవరి మాటలనూ లెక్కపెట్టకుండా ప్రజా వేదికను  కూల్చేయడమేమని ఆర్డర్ వేసేశారు. నిజానికి ప్రజా వేదిక కూల్చడం అంటే చంద్రబాబు నాయుడు సర్కార్ అవినీతి, అక్రమాలను కూల్చ‌డం అంటున్నారు.  అంచనాలను విచ్చలవిడిగా పెంచేసి కట్టిన అక్రమ‌ భవనం ఓ నిలువెత్తు  ఉదాహరణగా జనంలో ఉంటుందని జగన్ భావిస్తున్నారు. ఈ కూల్చివేతతో చంద్రబాబు పరువు కూడా కూలిపోతుందన్న మాస్టర్ ప్లాన్ తోనే ఇదంతా చేశారని అంటున్నారు.


తమ్ముళ్ళు అసలు విషయం తెలియక దాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎంతలా ఇది జనంలోకి వెళ్ళి చర్చ జరిగితే అంతలా చంద్రబాబు నాటి ప్రభుత్వం చేసిన అక్రమణలు,  అవినీతి పనులు  జనంలోకి వెళ్తాయని జగన్ భావిస్తున్నారుట. బాబు సర్కార్ అంతలా విచ్చలవిడిగా ఆక్రమణలకు పాల్పడిందా. ఇంతలా జనం సొమ్ము దుర్వినియోగం చేసిందా అన్న చర్చ ప్రజలలో రావాలన్నదే జగన్ ప్లాన్ ట. ఇపుడు తమ్ముళ్ళ అతి వల్ల అదే జరుగుతోంది. సో కూలింది ప్రజా వేదిక కాదు, టీడీపీ పరువు, బరువూ అన్నీనూ.


మరింత సమాచారం తెలుసుకోండి: