విజయవాడలో జరిగిన కాల్‌మనీ వ్యవహారంపై జగన్ సీరియస్‌గా స్పందించారు. కాల్‌మనీ వంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దీని వెనుక ఏ పార్టీ వాళ్లున్నా విడిచిపెట్టొద్దని అధికారుల్ని ఆదేశించారు. విజయవాడలో వడ్డీ కట్టని మహిళలను బలవంతంగా సెక్స్ రాకెట్‌లో దించుతున్నారు..

 

ఈ వ్యవహారంలో మీరు ఎన్ని కేసులు నమోదు చేశారో చెప్పమని ప్రశ్నించారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే.. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.

 

పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే వారిని నవ్వుతూ పలకరించాలన్నారు జగన్. అమెరికా లాంటి దేశాల్లో పోలీసులను కూడా ఎన్నిక ద్వారా నియమిస్తారు. ప్రజల విశ్వాసం చురగొనటమే ఆ విధానం లక్ష్యమన్నారు. ప్రజా స్వామ్యాన్ని పోలీసులే గౌరవించకపోతే.. ప్రజలు పోలీసుల్ని ఎలా గౌరవిస్తారన్నారు. ఎమ్మెల్యేలను గౌరవించండి.. వారు అక్రమాలకు, లూటీకి పాల్పడితే సహించొద్దని చెప్పారు.

 

ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నియంత్రించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. స్థానిక గిరిజనులకు ఉపాధి మార్గాలను అన్వేషించాలన్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో గంజాయి సాగవుతోందని.. గంజాయి సాగును రెవెన్యూ, పోలీసు, అటవీ, ఎక్సైజ్‌, వ్యవసాయ శాఖలు సమన్వయంతో అరికట్టాలన్నారు. స్పెషల్ ఆపరేషన్ చేపట్టాలన్నారు. గంజాయి సాగు చేసేవారికి ప్రత్యామ్నాయ ఉపాధి కోసం.. కాఫీ సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: