మపేదలు, గిరిజనులు, ఆదివాసీల  సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని ప్రధానమంత్రి మోదీ చెప్పారు.  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంపై మాట్లాడుతూ పేదలు, గిరిజనులు, ఆదివాసీలు  తమ ప్రభుత్వాన్ని నమ్మి మళ్లీ ఓటు వేశారని అన్నారు.  సామాన్య ప్రజలు తమ హక్కుల కోసం వ్యవస్థలతో పోరాడుతున్నారని ఈ పరిస్థితి మారాలి అని మోడీ అన్నారు.

 

ప్రజలను భాగస్వామ్యం చేసినప్పుడే   ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతుందని  నరేంద్ర మోడీ తెలిపారు.   మహాత్మాగాంధీ సామాన్యులను కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేశారని గుర్తు చేశారు.  ఎన్నికల్లో గెలుపు ఓటమి గురించి ఎక్కువగా ఆలోచించమని...  అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయాలన్నది ఆలోచిస్తామని అన్నారు.

 

ప్రజల సహకారంతో నవభారతం నిర్మిస్తామని నరేంద్ర మోడీ తెలిపారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ  తమ లక్ష్యాల నుంచి   పక్కకు వెళ్లబోమని మోడీ భరోసా ఇచ్చారు.  70 ఏళ్ల నుంచి ఉన్న పరిస్థితి మారేందుకు కొంత సమయం పడుతుందన్నారు.  రహదారులు,  వాడరేవులు, విమానాశ్రయాలను  అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని తన ప్రసంగంలో వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: