ఏపీ రాజధాని విజయవాడ నగరం నేరాల్లో ను దూసుకుపోతోంది.   గత ఏడాది రాష్ట్రంలోనే మొదటి స్థానం సంపాదించింది.  ఏపీ క్రైమ్ రిపోర్ట్ 2018 ఒకసారి పరిశీలిస్తే...2018లో రాష్ట్రంలో 1,22,268 కేసులు నమోదయ్యాయి. 

 

ఆస్తుల కేసుల్లో విజయవాడ, తూర్పుగోదావరి అగ్రస్థానములో ఉన్నాయి. గుంటూరు గ్రామీణ ప్రాంతాల్లో దాడులు కేసులు ఎక్కువ. 880 మర్డర్ కేసులు రాష్ట్రంలో గత ఏడాది చోటు చేసుకున్నాయి. ఆర్ధిక నేరాల్లో పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయవాడ అగ్రస్థానంలో ఉన్నాయి, మహిళల పై నేరాల్లో గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ముందున్నాయి. 

 

ఎస్సి ఎస్టీల పై దాడుల కేసుల్లో గుంటూరు జిల్లా, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో తొలి ముడుస్థానాల్లో ఉన్నాయి. రహదారి భద్రతా పై కూడా దృష్టి సారించాలి. రోడ్డు ప్రమాదాల్లో తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరులో ఎక్కువ మృత్యువాత పడ్డారు. 

 

సైబర్ క్రైం కూడా పెరిగింది.  1556 కేసులు నమోదయ్యాయి. అగ్రస్థానంలో విశాఖ నగరం ఉంది. డ్రగ్స్ కేసులు కూడా విశాఖలో నే ఎక్కువ ఉన్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: