ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం 2019లో కూడా అధికారంలోకి వస్తుంది అనుకుంది. అయితే ఆ అంచనాలు తారుమారయ్యాయి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండి గతంలో టీడీపీ చేసిన తప్పులను ఎత్తి చూపిస్తుంది. తెలుగుదేశం ఎన్నో అక్రమాలు చేసిందంటూ ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ నేత జగన్ చెబుతూనే ఉన్నారు. వాటిని అంత పెద్దగా పట్టించుకోని ప్రజలు ఇప్పుడు వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో తాను చెప్పిన ప్రతి మాటకు లెక్కలు, పత్రాలు చూపిస్తుంటే ఇదంతా నిజమేనా అని అందరూ అనుకుంటున్నారు.

తాజాగా అమరావతిలోని ఉండవల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్ల, ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో అక్రమాలు చేసిందంటూ చెప్పారు. ఇందుకు ఉదాహారణగా ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్న ప్రదేశమేనంటూ దానికి సంబంధించిన పత్రాలను చూపించారు.కృష్ణా నది పరిరక్షణ చట్టం ప్రకారం కరకట్ట మీద ఎలాంటి శాశ్వత నివాసాలు ఉండకూడదని తెలిసిందే.

కరకట్టపై నిర్మాణం అక్రమమని తెలిసీ చంద్రబాబు దాదాపు 9 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ప్రజావేదిక నిర్మించడం సరికాదనే వాదన ఉన్నప్పటికీ... దాన్ని కూల్చివేయాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయం కూడా సరికాదనే వాదన అంతే బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రజావేదిక నిర్మాణం కోసం వెచ్చించిన 9 కోట్ల రూపాయలు చంద్రబాబు జేబు నుంచి ఇచ్చింది కాదు, ఇది పూర్తిగా ప్రజాధనం మాత్రమే. అటువంటప్పుడు దీన్ని కూల్చివేయడం ద్వారా జగన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారనే వాదన మొదలైంది.

ఉండవల్లి కరకట్టపైన పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ నుంచి లీజుకు తీసుకున్న అందులోనే నివశిస్తున్నారు. ఇప్పుడు కరకట్టపైన నెలకొల్పిన ప్రజావేదికే కాదు అన్ని కట్టడాలను కూడా కూల్చివేయాలని సీఎం కలెక్టర్లకు ఆదేశించారు. ఈ మేరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటిని కూడా కూల్చివేయాల్సి ఉంటుంది.  ఈ నేపధ్యంలో చంద్రబాబు ఉండవల్లి నుంచి మరోక ప్రాంతానికి మరాల్సి వస్తుంది. అయితే చంద్రబాబు ఎక్కడ ఉంటారనే ప్రశ్న అందరిలో ఉంది. సీఎం జగన్ ఇప్పుడు చంద్రబాబుకు ఇంటున్న ఇంటిని కూల్చివేస్తున్నారు కాబట్టి ఎక్కడైన నివాసాన్ని ఏర్పాటు చేస్తారా... లేక చంద్రబాబే ఇంటిని వెతుక్కోవాలా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు.

గతంలో ప్రతపక్షంలో ఉన్న జగన్ కూడా హైదరాబాద్ నుంచే అమరావతికి వచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పని ఉన్న హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉండి ఏపీలో ఎక్కడు వెళ్ళానుకుంటే అక్కడకు నేరుగా వెళ్ళేవారు. ప్రస్తుతం అమరావతిలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి అధికారుల సమావేశాలను కూడా ఆయన ఇంటిలోనే ఏర్పాటు చేసుకున్నారు. సచివాలయంకు వెళ్లిన తర్వాతు సీఎంగా బాధ్యతలు, అధికారుల సమావేశాలు సెక్రటెరియట్ లో ఏర్పాటు చేసుకున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు శాశ్వత భవనం నిర్మించకుండా అద్దె భవనంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉంటున్న భవనాన్ని కూల్చివెస్తే చంద్రబాబు ఎక్కడ ఉంటారాన్న ప్రశ్న అందరిలో తలెత్తుంది. జగన్ లాగే హైదరాబాద్ లోని సొంత నివాసంలో ఉండి పని ఉన్నప్పుడు ఆంధ్రాకు వస్తారా... లేక కరకట్టపై ప్రస్తుతం ఉంటున్న ఇంటిలోనే ఉంటారా.. లేక  అమరావతి ప్రాతంలో సొంతంగా నివాసాన్ని ఏర్పార్చుకుంటారా... లేక మరోక భవనంలో అద్దెకు ఉంటారా అన్నది తెలాల్సి ఉంది. ప్రస్తుతం ప్రజావేదికను కూల్చివేయడానికి రంగం సిద్దమైంది. ఇందులో భాగంగా చంద్రబాబు ఇంటిని కూడా కూల్చివేయడంతో ప్రసుతం హైదరాబాద్ లోని తన నివాసంలోనే ఉండాల్సిన పరిస్తితి ఉంది.  విహారయాత్ర నుంచి వచ్చిన చంద్రబాబు ఏలాంటి నిర్ణయం తీసుకోనున్నారో వేచి చూడాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: