జగన్ ఇంత శెరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన రెడ్డి జెట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తీసుకుంటున్న నిర్ణయాల మీద ఎప్పుడు ఆలోచించారో? ఎప్పుడు కసరత్తు చేసారో కూడా తెలియదు. అధికారంలోకి వస్తూనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడం, ఇసుకను ఆన్ లైన్ లో విక్రయించడం, చకచకా ఐఎఎస్, ఐపిఎస్ లను బదిలీలు చేయడం, ఇలా ఒకటేమిటి, బోలెడు నిర్ణయాలు.


అదే సమయంలో ప్రజావేదిక కూలగొట్టడం అన్నది ఓ సంచలన నిర్ణయం. లేటెస్ట్ గా మరో నిర్ణయం తీసుకున్నారు. బాక్సయిట్ తవ్వకాలను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం. ఈరోజు జరిగిన ఐపిఎస్ ల మీటింగ్ లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.గిరిజనులు వద్దు అన్న తరువాత బలవంతగా తవ్వడంలో అర్థంలేదని, అలా బాక్సయిట్ ను విక్రయించకున్నా, ప్రభుత్వానికి వచ్చిన నష్టంలేదని, ఇలాంటి చర్యల వల్ల గిరిజనులు మావోయిస్టులకు దగ్గర కాకుండా నివారించవచ్చని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.


నిజంగా ఇది గట్టి చర్యే. ఇలాంటి మైనింగ్ ల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోవడం సంగతి అలావుంచితే, ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్లు, మావోయిస్టులకు కూడా ఆదాయం పోతుంది. కానీ ఒకటే అనుమానంగా వుంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఆయనకు ప్రజల్లో క్రేజ్ పెంచుతున్నాయి. కానీ రాజకీయ నాయకులు, దళారులు, అడ్డగోలు వ్యాపారులు మాత్రం కక్కలేక మింగలేక చేస్తున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తుందో?


మరింత సమాచారం తెలుసుకోండి: