న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతిలోని ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ మొదలైంది. సోమవారం ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చేస్తామన్నారు. అవినీతితో అక్రమంగా కట్టిన ప్రజావేదికను కూల్చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.  ప్రజావేదిక నుంచే అక్రమ కట్టడాల కూల్చివేత మొదలవుతుందన్నారు. ప్రజావేదికలో ఇదే చివరి సమావేశం అన్నారు. అవినీతి ఏ విధంగా జరిగిందో చెప్పడానికే ప్రజా వేదికలో సమావేశం పెట్టానన్నారు. వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికే ఇక్కడ సమావేశం నిర్వహించానని సీఎం జగన్ అన్నారు.  సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేత ప్రారంభించారు. 


ప్రజావేదికలోని ఫర్నీచర్‌, ఏసీలు, మైకులు, ఎలక్ట్రానిక్‌ సామగ్రిని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. కూల్చివేతపై సీఆర్డీయే ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. ఈ సూచనల మేరకు ఫర్నీచర్ సహా ఇతర సామాగ్రికి సంబంధించిన జాబితాను సీఆర్డీఏ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రజావేదిక వద్దకు జేసీబీలు, సుత్తెలు, పలుగు, పారలతో కూలీలు చేరుకున్నారు. రాత్రికి ప్రజావేదిక కూల్చివేత పనిని పూర్తి చేయనున్నారు. ప్రజావేదిక ఫర్నిచర్‌, ఎలక్ట్రికల్‌ సామాగ్రిని అధికారులు తరలించారు. హైకోర్టు సమీపంలోని నర్సరీకి పూల కుండీలను తీసుకెళ్లారు.


కాగా, ఉండవల్లి ప్రజావేదిక కూల్చ వద్దంటూ పిటిషనర్ శ్రీనివాస్ తరపు న్యాయవాది కృష్ణయ్య హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బుధ‌వారం లంచ్ మోషన్ పిటిషన్ వేసుకోవాలి అంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కి రిజిస్ట్రార్ సూచించారు. బుధ‌వారం కల్లా ప్రజావేదిక కూల్చి వేస్తారని…. కాబట్టి వెంటనే హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ స్వీకరించాలని రిజిస్ట్రార్ ను పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: