విజయవాడలోని ఉండవల్లిలో కృష్ణాతీరాన కొలువుతీరిన ప్రజా వేదిక ప్రస్థానం ముగుస్తోంది.  మూడేళ్ల క్రితం అప్పటి సీఎం చంద్రబాబు అధికారిక సమావేశాల కోసం  నిర్మించుకున్న ప్రజావేదిక కు నూకలు చెల్లాయి.   సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు ప్రజా వేదిక ను  అధికారులు కూల్చివేయడం ప్రారంభించారు.

 

కూల్చివేతకు సంబంధించి ముందుగా crda అధికారులు సాధారణ పరిపాలన అధికారులకు సమాచారం ఇచ్చారు.  ప్రజా వేదిక లోని  ఫర్నిచర్ ,  ఇతర సామాగ్రిని భద్రపరచుకోవాలనీ   సూచించారు.  దీంతో ప్రజా వేదిక లోని ఫర్నిచర్,  ఇతర సామాగ్రిని అధికారులు  ఇతర కార్యాలయాలకు తరలించారు.

 

కలెక్టర్ల సదస్సు పూర్తికాగానే  ప్రజా వేదిక కూల్చివేయాలని జగన్ ఖరాఖండీగా చెప్పడం తో అధికారులు ఆదేశాలు  అమలు ప్రారంభించారు.  ముందుగా ప్రజా వేదిక ముందు ఉన్న షెడ్డు తొలగించడం ప్రారంభించారు.  రాత్రి వేళ కూడా పనులు కొనసాగించాలని  నిర్ణయించారు.

 

ఈ మేరకు  కూలీలను crda అధికారులు ముందుగానే మాట్లాడుకున్నారు.  సాయంత్రం వేళ నుంచి కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి.  ముందుగా  ఇనుప నిర్మాణాలను తొలగించిన అధికారులు..  ఆ తర్వాత జెసిబి లతో ప్రజా వేదిక కూల్చివేయాలని నిర్ణయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: