రెండవ రోజు కలెక్టర్లుతో జరిగిన సమావేశంలో జగన్ ఒక విషయాన్ని క్లియర్ కట్ గా అధికారాలకు చెప్పారు. అవినీతి ఏ ఎమ్మెల్యే అయినా సరే చేసినట్లయితే వెంటనే నాకు తెలియజేయండి. తరువాత సంగతీ నేను చూసుకుంటానని స్ట్రెయిట్ గా చెప్పారు. దీనితో అవినీతి రహిత పాలనను అందిస్తానని చెప్పకనే చెప్పారు. దీనితో అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వటంతో వీరు అవినీతి అరికట్టగలరని పలువురు విశ్లేషిస్తున్నారు. 


అక్రమ కట్టడాల్ని కూల్చేస్తామంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు నదీపరివాహన ప్రాంతాల్లో ఉన్న అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. మరి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఇలాంటి కట్టడాలు అధికంగా ఉన్నాయి. దీంతో.. నిర్మాణాల్నికూల్చివేత సాగితే తమ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తూర్పుగోదావరి జిల్లా గోదావరి పరీవాహన ప్రాంతాల్లో కరకట్ట లోపల అనేక నిర్మాణాల్ని నిర్మించారు.


అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. వాస్తవానికి..నదికి.. కరకట్టకు మధ్య ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదు. చాలా కాలం అధ్యాత్మికం.. టూరిజం పేరుతో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. రాజమహేంద్రవరంలో చూస్తే.. ఇస్కాన్ టెంపుల్.. రివర్ బే.. టూరిజం కార్యాలయం.. చాంబర్ భవనం.. అయ్యప్ప గుడి.. కైలాసభూమి.. ఇటీవల నిర్మించిన మరో కొత్త గుడితో పాటు.. సరస్వతీ జ్ఞాన సరస్వతీ దేవాలయం నిర్మాణంలో ఉంది. ఇవి కాకుండా ధవళేశ్వరం సమీపంలోని లంకల్లోనూ ఇదే రీతిలో పక్కా భవనాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: