మూడేళ్ల క్రితం అప్పటి సీఎం చంద్రబాబు అధికారిక సమావేశాల కోసం  నిర్మించుకున్న ప్రజావేదిక కు నూకలు చెల్లాయి.   సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు ప్రజా వేదిక ను  అధికారులు కూల్చివేయడం ప్రారంభించారు.  బుధవారానికి ప్రజా వేదిక ప్రజలకు కనిపించకపోవచ్చు.

 

ప్రజా వేదిక కూల్చివేతపై  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తీవ్రంగా స్పందించారు.  జగన్ ఆలోచనా తీరు సరికాదని కామెంట్ చేశారు.  అనుమతులు లేని వాటిని కూల్చాలన్న  ఆలోచన  సరికా దని  చంద్రబాబు అన్నారు.

 

వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు  రాష్ట్రంలోని పలుచోట్ల ఎలాంటి అనుమతులు లేకుండానే   ఏర్పాటు చేశారని బాబు విమర్శించారు.  ప్రజా వేదిక తరహాలోనే ఆ విగ్రహాలను కూడా కొడతారా అని చంద్రబాబు జగన్ ను ప్రశ్నించారు.  యూరప్ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు  పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

 

తెలుగు దేశం నుంచి ఇతర పార్టీలోకి వలసలు,  రాజ్యసభ సభ్యుల విలీనం,  ప్రజావేదిక కూల్చివేత వంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చించారు చంద్రబాబు.   తెలుగుదేశం కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి  న్యాయం కోసం డిమాండ్ చేయాలని నిర్ణయించారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: