ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు మరో చల్లని కబురు చెప్పారు.  ఇప్పటికే వాలంటీర్ నియామకాల ద్వారా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలకు జగన్ అవకాశం కల్పించారు.   ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమైంది కూడా.

 

జగన్ నిరుద్యోగులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు.   వాలంటీర్ల తరహాలోనే మరో లక్ష న్నర ఉద్యోగాలకు జగన్ అవకాశం కల్పిస్తున్నారు.  గ్రామ సచివాలయం అనే కాన్సెప్టును బాగా విశ్వసిస్తున్న జగన్...   అందుకోసం కొత్తగా లక్ష న్నర ఉద్యోగాలు   సృష్టించారు.

 

ఈ ఉద్యోగాలు కూడా ఏ గ్రామంలోని వారికి  ఆ గ్రామంలోనే ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు,  గ్రామ పరిపాలన  చక్కగా సాగేందుకు  ఈ గ్రామ సచివాలయం వ్యవస్థ ఉపయోగపడుతుంది.  పరిపాలనలో తనకంటూ ప్రత్యేక ముద్ర కనిపించాలని తపిస్తున్న జగన్ గ్రామ సచివాలయం  వ్యవస్థకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు.

 

 మొత్తం మీద  వాలంటీర్లు ఉద్యోగాలతో కలిపి  గ్రామ సచివాలయ  ఉద్యోగాలు...  ఈ రెండూ కలిపి దాదాపు మూడున్నర లక్షల ఉద్యోగాలు జగన్ వచ్చాక  నిరుద్యోగులకు అందనున్నాయి.   జగన్ అనుకున్నట్టుగా గ్రామ సచివాలయం   వ్యవస్థను పటిష్టంగా అమలు చేయగలిగితే లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: