నెల రోజుల పాలనలో జగన్ ఎన్నో మెరుపులు మెరిపించారు. జెట్ స్పీడ్ నిర్ణయాలతో సామాన్యూలతో పాటు అందరినీ తన వైపునకు తిప్పుకున్నారు. జగన్ కి ఏం అనుభవం ఉందని అడిగిన వారికి షాక్ తగిలేలా జగన్ పాలన సాగింది.  అన్ని వర్గాలు జగన్ నిర్ణయాలు కొనియాడే పరిస్థితి.



అయితే ఇపుడు మాత్రం ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం పట్ల జనంలో మిశ్రమ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిజానికి ఇది ప్రజలకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా రాష్ట్ర ఖజానాకు సంబంధించిన విషయం. ఇపుడు లోటు బడ్జెట్ తో ఏపీ ఉంది. జగన్ తన ప్రమాణ్ స్వీకారం నుంచి అన్ని పనులకు అతి తక్కువ నిధులను ఉపయోగించి శభాష్  అనిపించుకున్నారు. బాబు దుబారాకు జగన్ తన పొదుపుతో జవాబు చెబుతున్నారని అంతా కొనియాడారు.


అయితే ఇపుడు తొమ్మిది కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజా వేదిక భవనాన్ని జగన్ ఒక్కసారిగా కూల్చడం పట్ల మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ప్రజా ధనం. ఇలా దుర్వినియోగం కావడం సబబు కాదని అంటున్నరు. ఏపీ ఆర్ధిక వ్యవస్థ కొంత సర్దుకున్నాక ఈ భవనం కూల్చవచ్చునని కూడా అంటున్నారు. అంతవరకూ ప్రభుత్వం వాడుకుని ఉంటే బాగుండేదని కూడా అంటున్నారు. జగన్ పొదుపు చర్యలు ఈ దెబ్బకు కొట్టుకుపోయాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: