రాష్ట్రం లో అధికారం లో ఉన్న వైకాపా ను కాదని ఆ పార్టీకి చెందిన  ఇద్దరు నాయకులు,  కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ లో చేరారు . వైకాపా నేతలు  కాసు విజయ భాస్కర్ రెడ్డి, వజ్ర భాస్కర్ రెడ్డిలు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సమక్షం లో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు .  . వైకాపా నేతలు , బీజేపీ లో చేరడం ఇప్పుడు  హాట్ టాఫిక్ గా మారింది . ఇప్పటి వరకు టీడీపీ కి చెందిన నేతలే, కమలదళం లో చేరుతుండగా, ఎన్నికల అనంతరం  వైకాపా నేతలు ఇద్దరు బీజేపీ లో చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది .


రాష్ట్రం లో వైకాపా అధికారం లోకి వచ్చి అట్టే సమయం కాలేదు. ఇంతలోనే ఆ పార్టీ నేతలు, పక్క పార్టీ లో చేరడం చూస్తే , ఆ పార్టీ నాయకత్వం వీరిని చేర్చుకుందా ?, లేకపోతే సదరు నాయకులే వెళ్లి ఆ పార్టీ లో చేరారా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే టీడీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా బీజేపీ నాయకత్వం విమర్శలను మూటగట్టుకుంది . గతం లో  టీడీపీ నాయకత్వం చేసిన తప్పే ... ఇప్పుడు బీజేపీ చేస్తోందన్న విమర్శలు సామాన్యుల నుంచి సైతం విన్పిస్తున్నాయి .


 ఈ తరుణం లో తమ పార్టీ లోకి టీడీపీ నుంచే కాదు , అధికార వైకాపా నుంచి కూడా నేతలు వలస వస్తున్నారని బిల్డప్ ఇవ్వడం కోసమే , బీజేపీ నాయకత్వమే కాసు విజయ భాస్కర్ రెడ్డి, వజ్ర భాస్కర్ రెడ్డిలను తమ పార్టీ లో చేర్చుకుని ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . వైకాపా లో  వీరిద్దరూ ఏ స్థాయి నాయకులో చెప్పకుండానే , బీజేపీ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: