మెగాస్టార్ చిరంజీవి 2008 లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009 లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు.  అప్పట్లో రాజకీయ సూన్యత లేకున్నా మెగాస్టార్ కొత్తపార్టీ పోటీ చేసి 18 స్థానాలు గెలుచుకుంది.  కొత్త పార్టీ మంచి ప్రభావమే చూపింది.  రాజకీయాలకు కొత్త కావడంతో మెగాస్టార్ కొంత ఇబ్బంది పడ్డాడు.  


అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రజారాజ్యాన్ని అందులో విలీనం చేశారు. ఇంకేముంది.. ప్రజారాజ్యం అధినేతకు కేంద్ర మంత్రి పదవి లభించింది.  2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో చిరు రాజకీయ ప్రస్థానం ముగిసింది. రాజ్యసభ సభ్యునిగా పదవీకాలం ముగిసిన తరువాత రాజకీయాలకు పూర్తగా దూరంగా ఉన్నారు. 


కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోలేదు.  ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉన్నది.  రాజకీయాల నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తరువాత మెగాస్టార్ చేసిన ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ కొట్టింది.  ఈ సినిమా హిట్ తో మెగాస్టార్ మరలా తన సినీ జైత్రయాత్ర మొదలు పెట్టాడు.  


అయితే, ఇప్పుడు బీజేపీ మెగాస్టార్ చిరంజీవిని తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నది. మెగాస్టార్ తో భేటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  రాజకీయాల్లోకి రాను అంటుంటున్నా... మెగాస్టార్ ను వదలకుండా రాజకీయాల్లోకి తీసుకురావాలని బీజేపీకి ప్రయత్నాలు చేయడం విశేషం. కాపు సామజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవడానికి మెగాస్టార్ ను రాజకీయాల్లోకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: