ప్రజావేదిక కూల్చివేత ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజామున సిఆర్డిఏ అధికారులు ప్రజావేదిక దగ్గరకు చేరుకుని కూల్చివేత వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత అన్యాయమని, అక్రమమమని తెలుగుదేదశంపార్టీ నేతలు గగ్గోలు పెడుతున్న విషయం అందిరికీ తెలిసిందే.

 

కూల్చివేతకు వ్యతిరేకంగా కోర్టును కూడా ఆశ్రయించారు. ప్రజావేదిక అక్రమ నిర్మాణమని కాబట్టి కూల్చివేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వాదించింది. దాంతో కూల్చివేత విషయంలో జోక్యం చేసుకోవటానికి కోర్టు నిరాకరించింది. దాంతో కూల్చివేతలు మొదలైపోయాయి.

 

చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే కరకట్టపైన ఉన్న అక్రమ నిర్మాణాల్లో ఒకటైన లింగమనేని గెస్ట్ హౌస్ ను తన క్యాంపాఫీసుగా తీసుకున్నారు. అక్రమ నిర్మాణమని తెలిసి కూడా చంద్రబాబు క్యాంపు ఆఫీసుగా పెట్టుకోవటం విచిత్రం. తాను అక్రమ కట్టడంలో ఉంటూనే ప్రభుత్వంతోనే మరో అక్రమ కట్టడాన్ని నిర్మింపచేశారు.

 

అధికారంలో నుండి దిగిపోగానే అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రజావేదిక కూల్చివేత షురూ అయ్యింది. మొత్తానికి చంద్రబాబు కలలకోట కూలిపోయింది. ప్రజావేదిక కూల్చివేత తర్వాత జగన్ తదుపరి టార్గెట్ ఏమిటి అన్న విషయంలో సస్పెన్స్ మొదలైంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: