అక్రమ భవనం లో నివాసం ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి  స్పష్టం చేశారు.  ఉండవల్లి కరకట్ట పైనున్న ప్రజా వేదిక కూల్చివేత  పనులను రామకృష్ణారెడ్డి పర్యవేక్షించారు.

 

ప్రజావేదిక కూల్చివేత పై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారనీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు. కరకట్ట మీద 60కి పైగా ఖరీదైన భవనాలు ఉన్నాయి.. వాటన్నిటికీ నోటీసులు ఇప్పించా...

ఈ నెల 21న దీనికి సంబంధించిన కేసు న్యాయస్థానం ముందుకు రావాల్సి ఉందనీ ఆయన వివరించారు.

 

ఈ నెల 21 న్యాయస్థానం ముందుకు ఈ కేసు రాకుండా చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేసారు...ప్రజావేదిక పక్కన ఉన్న ఇంట్లో చంద్రబాబు ఉండటం అన్యాయం..ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా తక్షణమే ఖాళీ చేయాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

 

చంద్రబాబు ను నేనైతే వదిలి పెట్టను..మిగిలిన వాళ్ళు తామంతట తాము ఖాళీ చేస్తే మంచిది..జగన్ కి ఉన్న  మంచి మనసును అంతా గుర్తించాలి.. అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియా తో అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: